Political News

ఏపీని సౌత్ బీహార్ అని పిలుస్తున్నారు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఆర్వోలు అంతా ఒక మాఫియాలా ఏర్పడి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్ఈసీ కూడా చంద్రబాబుకు తొత్తుగా మారిందని, పారదర్శకంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని ఆరోపణలు చేశారు.

నామినేషన్లు రిగ్గింగ్, స్క్రూటినీ రిగ్గింగ్, పోలింగ్ బూత్ లు రిగ్గింగ్, పోలింగ్ సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజిలు రిగ్గింగ్, రాత్రి పూట బ్యాలెట్ బాక్సులు సైతం రిగ్గింగ్ ఇవన్నీ దాటి అక్కడో ఇక్కడో కొంతమంది వైసీపీ వాళ్లు గెలిస్తే ఫలితాలు కూడా రిగ్గింగ్ అని జగన్ విమర్శించారు.

అనంతపురంలో వైసీపీ బూత్ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగ్ చేశారని, ఉరవకొండలోని కూడేరులో వైసీపీ ఏజెంట్లను పోలీస్ స్టేషన్లో సీఐ బంధించారని ఆరోపించారు. ‘‘ నా పులివెందులలో ఓటర్లపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, తిరుపతిలో దొంగ ఓటర్లను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టించారని చెప్పారు. అసలు చంద్రబాబు మూడేళ్లలో ప్రజలు ఏం చేశాడని ఆయనకు ఓటేశారని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటూ..ఆడబిడ్డ నిధి అంటూ అడ్డగోలుగా ప్రజలను మోసం చేశాడని, గతంలో తమ ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ ఎగ్గొట్టాడని విమర్శించారు.

ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవం ఉండేది, ఈ ఎన్నికలు చూసిన తర్వాత ఏపీని సౌత్ బీహార్ తో పోలుస్తున్నారు చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. డిజిటల్ విప్లవం నడుస్తున్న ఈ యుగంలో…ప్రపంచవ్యాప్తంగా తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం జెన్ జీ గొంతెత్తుతున్న ఈ తరంలో రిగ్గింగ్, సైక్లింగ్, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేయాలో ఏకంగా ట్యూషన్లు పెట్టి నేర్పిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే తన అడ్రస్ గల్లంతవుతుంది అని చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే ఎన్నికలను ఆయన హైజాక్ చేశాడని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జరిగినవి ఎన్నికలు కాదని, ఇవి ఎలక్షన్సా..సెలక్షన్సా..అని ప్రశ్నించారు.

This post was last modified on November 5, 2026 5:36 pm

Share

Recent Posts

అక్రమాలు చేశామని ఒప్పుకున్న అంబటి

వైసీపీ హయాంలో స్థానిక సంస్థలు జరిగిన తీరును వైసీపీ నేతలు మరిచిపోయినా...ఏపీ ప్రజలు మర్చిపోరు. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా…

33 minutes ago

చెవిరెడ్డిపై పులివర్తి సుధా రెడ్డి ర్యాగింగ్

వైసీపీ హయాంలో చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా నడిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై…

44 minutes ago

సమ్మర్ హాలిడేస్‌కు వింటర్ పరీక్ష

కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న సినిమాలు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందులోనూ ఇమేజ్ ఉన్న నటీనటులు కాకుండా చిన్న పిల్లలను…

2 hours ago

రోడ్డుపై పాడే సింగ‌ర్ కాంటాక్ట్ అడిగిన మ్యూజిక్ డైరెక్ట‌ర్

న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో రోడ్ల మీద ప్ర‌యాణం చేస్తుంటే.. ప‌క్క‌న మైక్ సెట్ పెట్టుకుని చ‌క్క‌గా పాట‌లు పాడుతూ అంధులు ద‌ర్శ‌న‌మివ్వ‌డం…

2 hours ago

భీమ్స్ సింప్లిసిటీ.. ఈ బైక్ వెనుక కథేంటి!

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక నార్మల్ హోండా…

4 hours ago

కుటుంబం చేసిన ఖరీదైన పొరపాటు

ఆదర్శ కుటుంబం రెండో వారంలో అడుగు పెట్టనుంది. వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నా ఇంత…

5 hours ago