వైసీపీ హయాంలో స్థానిక సంస్థలు జరిగిన తీరును వైసీపీ నేతలు మరిచిపోయినా…ఏపీ ప్రజలు మర్చిపోరు. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా గదిలో పెట్టి తాళాలు వేయడం మొదలు..నామినేషన్ పత్రాలు చించివేయడం వరకు జనాలకు అంతా గుర్తుంది. కానీ, జగన్ మాత్రం తనకేం తెలీదు అన్నట్లు ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని పులివెందుల ఆర్వో ఆఫీసు ముందు అమాయకుడిలా కూర్చున్నారు. అయితే, తమ పార్టీ నేతలు అంత అమాయకులు కాదని అంబటి రాంబాబు సెలవిచ్చారు.
గత ఎన్నికల్లో తాము అక్రమాలకు పాల్పడ్డాం కాబట్టే ఇప్పుడు తమకీ గతి పట్టిందని అంబటి అంగీకరించారు. గత ఎన్నికల్లో తాము చేసిన దాని వల్లే ఈ ఎన్నికల్లో తమకీ గతి పట్టిందని ఒప్పుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, భవిష్యతులో ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. అంటే, 2029లో ఒకవేళ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ తర్వాత ఇంతకన్నా దారుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అంబటి పరోక్షంగా ఇప్పుడే వార్నింగ్ ఇచ్చారు.
మద్యం రవాణా కేసులో ఈడీ విచారణకు హాజరైన అంబటిని మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. గత ఎన్నికల్లో మీరు అక్రమాలకు పాల్పడ్డారు కదా అని వారు ప్రశ్నించగా..అంబటి అవునని నిర్భయంగా తాము అక్రమాలు చేశామని చెప్పుకోవడం గమనార్హం. కర్మ సిద్ధాంతాన్ని అంబటి, వైసీపీ నేతలు పెద్దగా నమ్మినట్లు కనిపించడం లేదు. ఆ మాటకొస్తే అది అన్ని పార్టీలకు, వ్యక్తులకు వర్తిస్తుంది. అయితే, ఈ విష సంస్కృతిని ఎవరు మొదలుబెట్టారు? వారు గతంలో ఏ స్థాయిలో అరాచకం చేస్తే ప్రత్యర్థులు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న విషయాన్ని అంబటి గ్రహించాలి.
ఇక, మద్యం రవాణా కేసులో ఈడీ అధికారులకు అంబటి షాకింగ్ జవాబిచ్చారు. వైసీపీ నేతలు పురుషోత్తం, సుబ్బారెడ్డి మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ కోసం తన దగ్గరకు వచ్చారని చెప్పారు. వారికి సబ్ కాంట్రాక్ట్ కోసం తాను సిఫారసు చేసిన మాట వాస్తవమని అంగీకరించారు. తన దగ్గరకు వచ్చిన వారికి నో చెప్పనని, తనకు చేతనైన స్థాయిలో సిఫారసు చేస్తానని కూడా అంబటి అన్నట్టు వార్తలు వస్తున్నాయి.
This post was last modified on November 5, 2026 4:59 pm
వైసీపీ హయాంలో చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా నడిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై…
కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న సినిమాలు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందులోనూ ఇమేజ్ ఉన్న నటీనటులు కాకుండా చిన్న పిల్లలను…
నగరాలు, పట్టణాల్లో రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే.. పక్కన మైక్ సెట్ పెట్టుకుని చక్కగా పాటలు పాడుతూ అంధులు దర్శనమివ్వడం…
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక నార్మల్ హోండా…
ఆదర్శ కుటుంబం రెండో వారంలో అడుగు పెట్టనుంది. వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నా ఇంత…
విమాన ప్రయాణం అంటే చాలామందికి సౌకర్యవంతమైన అనుభవం. అయితే విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా తప్పవు. ముఖ్యంగా ఎక్కువ…