జ‌న‌సేన హిస్ట‌రీ రిపీట్‌… 100 ప‌ర్సంట్ స్ట్ర‌యిక్ రేట్‌!

“ఎన్ని స్థానాల్లో పోటీ చేశామ‌న్న‌ది కాదు.. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెల‌వాల‌న్న‌దే ముఖ్యం” అంటూ.. జ‌న‌సేన అధినేత, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌చుగా చెప్పే మాట‌.. మ‌రోసారి రిపీట్ అయింది. 2024 అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలో కూట‌మి త‌ర‌ఫున పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజ‌యం ద‌క్కించుకుని 100 ప‌ర్సంట్ స్ట్రయిక్ రేట్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ రెండున్న‌రేళ్ల‌లో వ‌చ్చిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ అదే హిస్ట‌రీని జ‌న‌సేన రిపీట్ చేసింది.

తాజాగా వెలువడిన మున్సిపల్, కార్పొరేష‌ణ్‌ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ చాలా చోట్ల పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి.. 100 శాతం స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసింది: అమలాపురంలో పోటీ చేసిన స్థానాల్లో జనసేన పార్టీ 11కి 11 స్థానాలు గెలుచుకుని 100 శాతం స్ట్రైక్ రేట్‌ను సాధించింది. అలానే.. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీలో కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన ఘన విజయం సాధించింది. ఇక్కడ చైర్మన్ పదవితో పాటు పోటీ చేసిన వార్డుల్లో అన్ని చోట్లా గెలుపు గుర్రం ఎక్కింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వంటి పలు ప్రాంతాల్లో కూడా జనసేన అభ్యర్థులు ఇలానే విజయాలు నమోదు చేశారు.

ఇక‌, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో జనసేన అభ్యర్థి ఘన విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన స్థానాల్లో ప్రధాన మున్సిపాలిటీలను గెలుచుకుంది. పిఠాపురం జనసేన అభ్యర్థి దానం లాజర్ బాబు 9,235 ఓట్ల భారీ మెజారిటీతో మున్సిపల్ ఛైర్మన్‌గా గెలిచారు. ఇక్కడ మొత్తం 33 వార్డులకు గాను 19 వార్డుల్లో జనసేన విజయం సాధించింది. తెనాలిలో జనసేన అభ్యర్థి తోటకూర వెంకట రమణారావు 17,093 ఓట్ల భారీ మెజారిటీతో ఛైర్మన్‌గా విజయం సాధించారు. పెడనలో జనసేన అభ్యర్థిని బల్లా జ్యోత్స్నరాణి 4,380 ఓట్ల మెజారిటీతో ఛైర్మన్‌గా గెలిచారు.. అంతేకాదు.. పోటీ చేసిన అన్ని వార్డుల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది.

న‌ర‌సాపురం, నిడ‌ద‌వోలు, సామ‌ర్ల‌కోట‌, పుట్ట‌ప‌ర్తిలో కూట‌మిలో భాగంగా జ‌న‌సేన‌కు కేటాయించిన అన్ని వార్డుల్లోనూ 100 శాతం స్ట్ర‌యిక్ రేట్ సాధించారు. నరసాపురం జనసేన అభ్యర్థిని కొత్తపల్లి శైలజ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గెలుపొందారు. నిడదవోలులో జనసేన అభ్యర్థిని జ్యోతి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా విజయం సాధించారు. సామర్లకోటలో జనసేన అభ్యర్థి పిట్టా జానకి రామారావు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. పుట్టపర్తిలో జనసేన అభ్యర్థి ఎం. ఈశ్వర్ మున్సిపల్ ఛైర్మన్‌గా విజయం సాధించారు. ఇలా.. మొత్తంగా జ‌న‌సేన మ‌రోసారి త‌న హిస్ట‌రీని రిపీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.