కంగ్రాట్యులేష‌న్స్‌.. ‘టీం సీబీన్‌’ : జ‌గ‌న్

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. ఆ పార్టీ అధిప‌తి, మాజీ సీఎం జ‌గ‌న్‌కు ఎక్క‌డో తీవ్ర‌మైన బాధ క‌లిగిన‌ట్టు ఉంది. అందుకే.. మంగ‌ళ‌వారం బాగా పొద్దుపోయాక‌.. ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. దీనిలో కొంత వ్యంగ్యం.. మ‌రికొంత ఆక్రోశం క‌ల‌గ‌లిపి.. కూట‌మి ప్ర‌భుత్వంపై ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబుపై వ్యాఖ్య‌లు చేశారు. ‘కంగ్రాట్యులేష‌న్స్ .. టీం సీబీఎన్‌, పోలీస్‌, ఎస్ఈసీ’ అని పేర్కొంటూ.. త‌న ఆవేద‌న‌ను నిశితంగా వెల్ల‌డించారు.

‘కంగ్రాట్యులేష‌న్స్ .. టీం సీబీఎన్‌, పోలీస్‌, ఎస్ఈసీ’ !

ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం కూడా దక్కకుండా చూసుకోవడం ద్వారా, ఎన్నికల్లో ఎంత అద్భుతంగా గెలవవచ్చో మీరు నిరూపిం చారు!. ప్రతి దశలోనూ ఈ ప్రక్రియను తారుమారు చేశారు: నామినేషన్: అపహరణకు గురైంది!. పరిశీలన: అపహరణకు గురైంది!. అని జ‌గ‌న్ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్య‌ల ద్వారా ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా జ‌గ‌న్ త‌న ఆవేద‌న‌ను వెల్ల‌డించారు. ఎన్నిక‌ల్లో త‌మ‌ను పోటీ చేయించ‌కుండా అడ్డుకున్నార‌న్న‌ది జ‌గ‌న్ తొలినుంచి చెబుతున్నారు. తాజాగా మ‌రోసారి ఆయ‌న ట్వీట్‌లోనూ పేర్కొన్నారు. అలానే హైజాక్‌(అప‌హ‌ర‌ణ‌) చేశార‌న్న వ్యాఖ్య‌ల‌ను కూడా కొత్త‌గా చెప్పిందేమీ కాదు. ఆయ‌న త‌ర‌చుగా ఇటీవ‌ల కాలంలో వ్యాఖ్యానిస్తున్నారు.

సో.. మొత్తంగా వైసీపీ ఓట‌మితో జ‌గ‌న్ మండిపోయార‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. కానీ, దీనిని ఆయ‌న ప్ర‌త్యక్షంగా వెల్ల‌డించ‌కుండా.. ప‌రోక్షంగా ‘కంగ్రాట్యులేష‌న్స్ .. టీం సీబీఎన్‌, పోలీస్‌, ఎస్ఈసీ’ అంటూ.. వ్యంగ్యంగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.