Political News

టార్గెట్ తెలంగాణ: బీజేపీ పెద్ద‌ల వ్యూహం ఏంటి?

బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. తాజాగా తెలంగాణ‌లో ప‌ర్య‌టించారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న వెనుక పెద్ద వ్యూహమే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. తెలంగాణ ప‌ర్య‌ట‌న ఏమీ వారాల ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ కాదు… రెండు మూడు రోజుల ముందు తీసుకున్న నిర్ణ‌యాన్ని సోమ‌వారం అమ‌లు చేసేశారు. ఇలా.. తెలంగాణ ప‌ర్య‌ట‌న‌ను పెట్టుకోవ‌డం.. ఇక్క‌డ భారీ పాద‌యాత్ర నిర్వ‌హించ‌డం.. అనంత‌రం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకోవ‌డం వెనుక చాలా వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు.

ఆదివారం అలా..

ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వ‌హించింది. ఓట్ బ‌జావో పేరుతో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన కాంగ్రెస్‌.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరిగింది. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా బీజేపీ కూడా ఉత్త‌రాది రాష్ట్రాల్లో సిక్కుల‌తో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. దీనికి కొన‌సాగింపుగా అమిత్‌షా నేతృత్వంలో బీజేపీ.. తెలంగాణ‌ను ల‌క్ష్యంగా చేసుకుని ముందుకు సాగ‌డం, ఇక్క‌డ పాద‌యాత్ర‌కు రెడీ అవ‌డం, నాయ‌కులను ఏకం చేయ‌డం వంటివి రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అంతేకాదు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఇప్పుడు బీజేపీ వ్యూహాలు సిద్దం చేయ‌డం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర‌స‌న తెలిపితే.. బీజేపీ హైద‌రాబాద్‌ను ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం.

దక్షిణాదిలో కాంగ్రెస్‌..

ప్ర‌స్తుతం ఉత్త‌రాదిలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి తీవ్ర ఇర‌కాటంలో ప‌డింది. ఇటీవ‌ల మూడు ఉత్త‌రాది రాష్ట్రాల్లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆపార్టీ ఒక్క సీటును కూడా ద‌క్కించుకోలేదు. ఇదే స‌మ‌యంలో ద‌క్షిణాదిలో కొంత మేర‌కు కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోంది. తెలంగాణ‌, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల్లో అధికారంలో ఉండ‌గా.. త‌మిళ‌నాడులో విజ‌య్ పార్టీతో పొత్తు పెట్టుకుని అక్క‌డ కూడా అధికారం పంచుకుంది. సో.. ఉత్త‌రాదిలో కాంగ్రెస్ బ‌ల‌హీన ప‌డుతున్నా.. ద‌క్షిణాదిలో అస్తిత్వాన్ని నిల‌బెట్టుకుంటోంది. ఈ ప‌రిణామ‌మే బీజేపీకి గిట్ట‌డం లేదు. పైగా కాంగ్రెస్‌కు ద‌క్షిణాది నుంచే నిధులు అందుతున్నాయ‌ని బీజేపీ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాదిలో త‌మ బ‌లం చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తెలంగాణ అయితేనే..

దేశ రాజ‌కీయాల్లో క‌ర్ణాట‌క కంటే కూడా.. తెలంగాణ రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఉంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఇవ్వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన బీజేపీ ఇక్క‌డ పాగా వేయాల‌న్న‌ది ఆది నుంచి ఉన్న ఆలోచ‌నే. ఇటీవ‌ల కాలంలో రేవంత్ రెడ్డి సైతం త‌మ‌కు కంట్లో న‌లుసుగా మార‌డంతో బీజేపీ వ్యూహం పూర్తిగా తెలంగాణ‌పైనే కేంద్రీ కృత‌మైంది. ఇక‌, తాజాగా రేవంత్ రెడ్డి.. ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేసుకున్న ద‌రిమిలా.. బీజేపీ కూడా ఆయ‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుంది. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించే పేరుతో బీజేపీ నాయ‌కులు హైద‌రాబాద్‌లో పాద‌యాత్ర‌కు ప్లాన్ చేయ‌డం, దీనికి ఏకంగా అమిత్ షానే రంగంలోకి దిగ‌డం గ‌మ‌నార్హం.

షానే ఎందుకు?

త‌మ‌కు పెద్ద‌గా ప్రాబ‌ల్యం లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇటీవ‌ల కాలంలో అధికారంలోకి వ‌చ్చింది. ఇలాంటి వాటిలో ప‌శ్చిమ బెంగాల్ ఒక‌టి. దీనికి కార‌ణం.. అమిత్‌షా మంత్రాంగం. బీజేపీలో ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా.. షా రాజ‌కీయ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఆయ‌న వేసే అడుగులు, ఎంపిక చేసుకునే అంశాలు కూడా పార్టీని బ‌లోపేతం చేస్తాయి. గుజ‌రాత్‌లో వ‌రుస విజ‌యాలు సాధించ‌డానికి ఆయ‌న వేసిన ప్లానే ఇప్ప‌టికీ అమ‌ల్లో ఉంద‌ని అంటారు. అలానే.. తెలంగాణ‌లో బీజేపీని గ‌ద్దె ఎక్కించేందుకు షా కీల‌క‌నేత‌గా మార‌నున్నార‌ని అంటున్నారు. అందుకే.. ప‌క్కా వ్యూహంతో అటు కాంగ్రెస్‌కు, ఇటురేవంత్ రెడ్డి దూకుడుకు కూడా చెక్ పెట్టేలా షాను రంగంలోకి దింపార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది.

This post was last modified on November 3, 2026 9:59 am

Share

Recent Posts

నేను ఒక్క సిగ్నల్ ఇస్తే… బిగ్-బి వార్నింగ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ చాలా ప్రశాంతచిత్తంతో కనిపించే వ్యక్తి. పబ్లిక్ ఫాట్ ఫామ్స్‌లో ఆయనకు ఆగ్రహం రావడం…

5 minutes ago

మ‌మిత అస‌లు పేరు అది కాదా?

మ‌మిత బైజు.. ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ సినిమాలో ఒక సంచ‌లనం. కొన్నేళ్ల ముందు ప్రేమ‌లు సినిమాతో మ‌ల‌యాళీల‌తో పాటు ఇత‌ర…

40 minutes ago

జగన్ కు ఎవరైనా చెబితే బాగుండు

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి అధ్యక్షుడు…

1 hour ago

స్టార్ సినిమా శ్రీలీలకే దక్కింది

తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే…

10 hours ago

పెళ్లి కోసం తపించిపోయేవాళ్ళు ఇంతమంది ఉన్నారా?

నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…

11 hours ago

రష్మిక తాండవం ఊహించలేదు

ర‌ష్మిక మంద‌న్నా కెరీర్లో ఎక్కువ‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గానే న‌టించింది. ఈ మ‌ధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…

11 hours ago