భారత దేశంలో గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ కి గతమంతా ఘనం. అయితే, కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. కాంగ్రెస్ లో వర్గ పోరు ఎక్కువగా ఉంటుందని, గ్రూపులుగా ఏర్పడి పార్టీకి నష్టం కలిగిస్తుంటారని విమర్శలున్నాయి. అయినా సరే కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గల్లీ ఫైట్ చేశారని టాక్ వస్తోంది.
ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య బాహాబాహి జరిగిందని ప్రచారం జరుగుతోంది. డీసీసీ నియామకం వ్యవహారం విషయంలో వీరిద్దరి మధ్యలో మాట మాట పెరిగి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లిందని తెలుస్తోంది. ‘‘నీ గురించి ఏం అనుకుంటున్నావు…పగలగొడతా…” అంటూ ఎమ్మెల్యేపై మంత్రి దాడి చేశారని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటన సమయంలో కీలక నాయకుడితో పాటు ఓ ప్రముఖ దినపత్రికకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆ గదిలో ఉన్నారని టాక్.
మిగతా ఎమ్మెల్యేల ముందు, పాత్రికేయుల ముందు తనను మంత్రి దూషించి, అవమానించి దాడి చేశారని పీసీసీకి ఎమ్మెల్యే ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్ హై కమాండ్ కు కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates