విజయదశమి పండగ వచ్చే కీలకమైన అక్టోబర్ నెల అయిపోయింది. టాలీవుడ్ బాక్సాఫిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సీజన్ మిశ్రమ ఫలితాలతో ఒకరకంగా నిరాశ పరిచిందని చెప్పాలి. టయర్ 1 హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాకపోవడం ఒక పెద్ద లోటు కాగా వస్తాయనుకున్నవి వాయిదా పడటం ఇంకో దెబ్బ వేసింది. మొదటివారంలో వచ్చిన సిగ్మా, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రాలు మంచి సంస్థల బ్యాకప్ ఉన్నా తీవ్రంగా నిరాశ పరిచాయి. తెల్ల కాగితం హడావిడికే పరిమితమయ్యింది.
డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయడంలో బాగా ఆలస్యానికి గురైన హనుమాన్ అంశ్ మన ఆడియన్స్ పట్టించుకోకపోవడంతో డిజాస్టరయ్యింది. బాలీవుడ్ లో నాలుగు వందల కోట్లు వసూలు చేసిన మూవీకి ఇలాంటి ఫలితం దక్కడం అనూహ్యం. అదే వారం వచ్చిన కామ్రేడ్ కళ్యాణ్ కొంత ఊరట కలిగించింది. సామజవరగమన రేంజ్ లో కాదు కానీ ఉన్నంతలో కమర్షియల్ గా గట్టెక్కి శ్రీవిష్ణుకి హ్యాట్రిక్ ఫ్లాపులు రాకుండా ఆపింది. ఆ తర్వాత మూడో వారం బాక్సాఫీస్ కు చెప్పుకోదగ్గ ఊపొచ్చింది.
మొదటి భాగం స్థాయిలో లేకపోయినా ఆంచనాలకు మించి జైలర్ 2 పెర్ఫార్మ్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దది కావడంతో కమర్షియల్ రేంజ్ ఎంతనేది ఠక్కున చెప్పలేం కానీ భారీ వసూళ్లు సాధించిన మాట వాస్తవం. నెగటివిటీని తట్టుకుని రణబాలి మంచి కలెక్షన్లే సాధించినా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాలు, ఓవర్సీస్ లో ఆశించిన ఫలితం అందుకోలేదు. గరివిడి లక్ష్మి ఉత్తరాంధ్రలో మాత్రమే బయ్యర్లను లాభాల బాట పట్టించగా మిగిలిన సెంటర్లలో ఫ్లాప్ ముద్ర వేయించుకుంది.
హారర్ జానర్ అయినప్పటికీ 418 మీద మంచి హైప్ నెలకొనడంతో ఓపెనింగ్స్ వచ్చాయి. వాటిని పెంచుకునే స్థాయిలో టాక్ పెరగకపోయినా బడ్జెట్ తక్కువ కావడంతో రికవరీ వేగంగా జరిగింది. మొన్న నెలాఖరున వచ్చిన వాటిలో ఆదర్శ కుటుంబం ఏకె 47 ఓ మోస్తరు డీసెంట్ టాక్ తో డామినేషన్ చూపిస్తుండగా విశ్వక్ సేన్ కల్ట్ వీకెండ్ తర్వాత నిలవడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే దసరాకు సరిపడా కిక్కు అక్టోబర్ అయితే పూర్తిగా ఇవ్వలేదు.
This post was last modified on November 1, 2026 10:19 am
ఏడాదికి రెండు సినిమాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఆదిపురుష్ నుంచి కష్టపడుతున్న ప్రభాస్ పని విషయంలో వెనక్కు తగ్గడం లేదు కానీ,…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే.. ఒక విషాదం చోటు చేసుకోగా..…
నవంబర్ వచ్చేసింది. నాలుగు వేల కోట్లతో తీసినట్టుగా చెప్పబడుతున్న రామాయణ సిరీస్ మొదటి భాగం పార్ట్ 1 అయిదో తేదీ…
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి.. ఒమర్ అబ్దుల్లా తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 56 సంవత్సరాలు. గత…
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి.. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో చేతులు ఎత్తేశారు. కారణాలు…
నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థిని మీద ఒక యువకుడు రంపపు మెషీన్ తో దాడి చేసిన…