Political News

రాప్తాడు దారుణానికి ప్రేమ నిరాకరణే కారణమా?

రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో బాలికపై అమానుష దాడి ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసు బృందాలు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి తర్వాత బైక్ పై పారిపోతున్న నిందితుడిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. చివరకు ధర్మవరం రైల్వే స్టేషన్ లో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

నిందితుడిని అక్కయ్యవారిపాలెం గ్రామానికి చెందిన యువకుడు హేమంత్ గా గుర్తించినట్లు తెలుస్తోంది. అతడి తల్లిదండ్రులు చనిపోగా అక్క దగ్గర ఉంటున్నాడని తెలుస్తోంది. బాధితురాలికి ఆ యువకుడు బంధువు అవుతాడని తెలుస్తోంది. అయితే, బాధిత బాలిక తన ప్రేమను అంగీకరించకపోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. కాగా, కుటుంబ తగాదాల నేపథ్యంలోనే బాలికపై దాడికి ఒడిగట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పోలీసులు అధికారికంగా కారణాలు వెల్లడించాల్సి ఉంది.

మరోవైపు, బాధిత బాలికను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రి నుంచి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాధిత బాలిక కుటుంబాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు.

బాధిత బాలిక అనంతపురం ఆసుపత్రికి వచ్చే సమయంలో పూర్తిగా బీపీ పడిపోయిందని, స్పృహ లేకుండా జీరో పల్స్ తో ఆసుపత్రికి తీసుకువచ్చారని సత్య కుమార్ తెలిపారు. అక్కడి వైద్యులంతా తక్షణమే స్పందించి బాలికకు అత్యవసర చికిత్స అందించారని అన్నారు. ఆ తర్వాత బాలిక పరిస్థితి కాస్త మెరుగైందని, బీపీ 133/80కి వచ్చిందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించామని తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలిక పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో బాధిత బాలికపై దాడిని అడ్డుకోబోయిన క్రమంలో గాయపడ్డ బాలిక పరిస్థితి నిలకడగా ఉంది.

This post was last modified on October 31, 2026 7:49 pm

Share

Recent Posts

ఇది రజినీ ఒక్కడికే సాధ్యం

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇప్పుడు 76 ఏళ్లు. ఈ వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర ఆయన చూపిస్తున్న హవా అసామాన్యం. తమిళంలో…

32 minutes ago

తెరపై హింసకు అడ్డుకట్ట వేయాల్సిందే

గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత తెరమీద వయొలెన్స్ వికృత రూపాలు దాల్చింది. హత్యలు ఎంత దారుణంగా చేయొచ్చో…

3 hours ago

స్టార్ డైరెక్టర్… బాత్రూంలో పడి

బాలీవుడ్లో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ గుప్తా హఠాత్తుగా చనిపోయారు. ఆయన వయసు 57 ఏళ్లే.…

5 hours ago

ఇలా అయితే జ‌గ‌న్ రావ‌డం క‌ష్ట‌మే

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హారం.. మ‌రోసారి ఢిల్లీ వ‌ర‌కు చేరిందా? ఆయ‌న‌పై బీజేపీ అగ్ర‌నేత ఒక‌రు సీరియ‌స్ కామెంట్లు చేశారా?…

5 hours ago

ఇలాంటి వాల్లని ఉరి తీయాలి

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై 26 ఏళ్ల ఉన్మాది రంపంతో దాడి…

5 hours ago

వృషకర్మ అడ్వాన్స్ అవ్వడం మంచిదే

డిసెంబర్ 4 విడుదల కాబోతున్న వృషకర్మ ముందుగానే ప్రమోషన్ల పర్వానికి తెర తీసింది. రిలీజ్ డేట్ వరకు మధ్యలో ఉన్న…

5 hours ago