సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇప్పుడు 76 ఏళ్లు. ఈ వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర ఆయన చూపిస్తున్న హవా అసామాన్యం. తమిళంలో రెండున్నర దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీ హిట్టు కొట్టినా ఆయనే.. బద్దలు కొట్టినా ఆయనే. వేరే హీరోలకు ఛాన్సివ్వట్లేదు. మధ్యలో విజయ్ ఆయన్ని మించి ఎదిగిపోతున్నట్లు కనిపించాడు కానీ.. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ సూపర్ స్టార్ తనేంటో రుజువు చేసుకుంటున్నారు.
మూడేళ్ల ముందు ‘జైలర్’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన.. ఇప్పుడు ‘జైలర్-2’తో తన రికార్డును తానే బద్దలు కొట్టారు. కొన్ని రోజుల ముందే ఈ సినిమా రూ.650 కోట్ల మార్కును దాటి తమిళంలో కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు రూ.700 కోట్ల మార్కును కూడా దాటేశాయి. ఇప్పటికీ ఈ మూవీ ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది. త్వరలోనే రూ.800 కోట్ల మార్కును కూడా అందుకోబోతోంది. వెయ్యి కోట్ల మైలురాయిని అందుకోవడం మాత్రం కష్టమే.
తాజాగా ‘జైలర్-2’ ఒక అరుదైన ఘనతను సాధించింది. దక్షిణాదిన ప్రతి రాష్ట్రంలోనూ రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ‘జైలర్-2’ రికార్డు నెలకొల్పింది. ఏపీ, తెలంగాణను ఒక టెర్రిటరీగా పరిగణిస్తే ఇక్కడ ఈ మూవీ రూ.100 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడులో వసూళ్లు ఎప్పుడో వంద కోట్ల మార్కు దాటేసింది. లేటెస్ట్‌గా కర్ణాటకలో, అలాగే కేరళలో కూడా ‘జైలర్-2’ రూ.75 కోట్ల మార్కును అందుకుంది. దక్షిణాదిన చాలామంది సూపర్ స్టార్లు ఉన్నారు. కానీ అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేదు.
ఇతర భాషల స్టార్లకు మలయాళంలో ఒక స్థాయికి మించి వసూళ్లు రావు. కానీ రజినీ మాత్రం ఆ చిన్న రాష్ట్రంలోనూ రూ.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించాడు. విజయ్, సూర్యలకు కూడా కేరళలో మంచి మార్కెట్టే ఉన్నప్పటికీ.. ఈ రేంజ్ రీచ్ అంటే కష్టం. ఇది ఇంకే హీరో అందుకోలేని రికార్డని చెప్పాలి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్-2’కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.
This post was last modified on October 31, 2026 7:46 pm
రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో బాలికపై అమానుష దాడి ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.…
గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత తెరమీద వయొలెన్స్ వికృత రూపాలు దాల్చింది. హత్యలు ఎంత దారుణంగా చేయొచ్చో…
బాలీవుడ్లో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ గుప్తా హఠాత్తుగా చనిపోయారు. ఆయన వయసు 57 ఏళ్లే.…
వైసీపీ అధినేత జగన్ వ్యవహారం.. మరోసారి ఢిల్లీ వరకు చేరిందా? ఆయనపై బీజేపీ అగ్రనేత ఒకరు సీరియస్ కామెంట్లు చేశారా?…
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై 26 ఏళ్ల ఉన్మాది రంపంతో దాడి…
డిసెంబర్ 4 విడుదల కాబోతున్న వృషకర్మ ముందుగానే ప్రమోషన్ల పర్వానికి తెర తీసింది. రిలీజ్ డేట్ వరకు మధ్యలో ఉన్న…