ఎవరి పేరు చెబితే.. రాజకీయ నేతల నుంచి అధికారుల వరకు వణికిపోయేవారో.. అలాంటి వ్యక్తి చోటా రాజన్. మూడు దశాబ్దాల పాటు దేశాన్ని కుదిపేసిన చోటా రాజన్ వ్యవహారం.. గ్రామ గ్రామానా పాకిపోయింది. చోటా రాజన్ పేరు చెబితేనే నాయకుల చేతులు వణికేవి. అలాంటి వ్యక్తిని నిర్దోషిగా పేర్కొంటూ.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2009లో జరిగిన నడిరోడ్డుపై దారుణ హత్యాయత్నం కేసులో తగిన సాక్ష్యాలు లేవంటూ.. రాజన్‌ను ఈ కేసు నుంచి తప్పిస్తున్నట్టు పేర్కొంది. ఇది రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఎవరీ రాజన్? ఏంటా కేసు?
గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికాల్జే. మహారాష్ట్రలో దారుణాలకు, ఘోరాలకు పెట్టింది పేరు. చోటా రాజన్‌గా దేశవ్యాప్తంగా గ్యాంగ్‌స్టర్‌గా పేరొందిన ఈయన.. రాజకీయ నేతలకు సింహస్వప్నంగా మారాడు. 2009 నాటి శివసేన నేత అజయ్ భోస్లే హత్య కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇస్తూ నిర్దోషులుగా ప్రకటించింది అక్టోబర్ 11, 2009న పుణేలోని కోరేగావ్ ప్రాంతంలో శివసేన నాయకుడు అజయ్ భోస్లే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, మోటార్ సైకిల్‌పై వచ్చిన కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో భోస్లే ప్రాణాలతో తప్పించుకోగా, ఆయన డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన ఈ కేసులో చోటా రాజన్‌తో పాటు పలువురిపై మోపిన హత్యాయత్నం, నేరపూరిత కుట్ర ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రత్యేక న్యాయమూర్తి నరేంద్రనాథ్ ప్రధాన్ అందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో సీబీఐ కోర్టు నుంచి ఊరట లభించినప్పటికీ చోటా రాజన్ జైలు నుంచే విడుదల కాలేరని న్యాయవాదులు తెలిపారు.
జర్నలిస్ట్ జె.డే హత్య కేసుతో పాటు పలు ఇతర కేసుల్లో ఇప్పటికే అతనికి జీవిత ఖైదు పడటంతో ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. 2015లో ఇండోనేషియాలోని బాలిలో అరెస్ట్ అయిన తర్వాత అతనిపై ఉన్న దాదాపు 71 కేసులను మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. అప్పటి నుంచి అవి విచారణ దశలోనే ఉన్నాయి.
This post was last modified on October 31, 2026 10:15 pm
రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో బాలికపై అమానుష దాడి ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇప్పుడు 76 ఏళ్లు. ఈ వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర ఆయన చూపిస్తున్న హవా అసామాన్యం. తమిళంలో…
గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత తెరమీద వయొలెన్స్ వికృత రూపాలు దాల్చింది. హత్యలు ఎంత దారుణంగా చేయొచ్చో…
బాలీవుడ్లో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ గుప్తా హఠాత్తుగా చనిపోయారు. ఆయన వయసు 57 ఏళ్లే.…
వైసీపీ అధినేత జగన్ వ్యవహారం.. మరోసారి ఢిల్లీ వరకు చేరిందా? ఆయనపై బీజేపీ అగ్రనేత ఒకరు సీరియస్ కామెంట్లు చేశారా?…
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై 26 ఏళ్ల ఉన్మాది రంపంతో దాడి…