Political News

మిథున్ రెడ్డి ఎక్కడున్నారు?

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందా? ఆయ‌న ఆచూకీ కూడా క‌నిపించ‌డం లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముందు ఇలా ఎంపీ మిథున్‌రెడ్డి ఆచూకీ క‌నిపించ‌క‌పోవ‌డంతో వైసీపీ నాయ‌కుల్లో క‌ల‌క‌లం రేగింది. ఆయ‌న ప‌రార‌య్యార‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. అలాంటిదేమీ లేద‌ని.. ఢిల్లీకి వెళ్లి ఉంటార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారం శుక్ర‌వారం రాత్రి రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది.

అరెస్టు భ‌య‌మేనా?

శుక్ర‌వారం సాయంత్రం వేళ ఏపీ హైకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు ఇచ్చింది. మిథున్‌రెడ్డిని అరెస్టు చేయ‌కుండా ఆప‌లేమ‌ని.. ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకునేది లేద‌ని తేల్చి చెప్పింది. అప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉన్న ప‌రిస్థితి అనూహ్యంగా మారిపోయింది. మిథున్‌రెడ్డి న్యాయ‌వాదులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన అనంత‌రం.. ఆయ‌న ఆచూకీలేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఉమ్మ‌డిచిత్తూరు జిల్లా పుంగ‌నూరు పోలీసులు కూడా మిథున్‌రెడ్డి కోసం ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఆచూకీ ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది. హైకోర్టు ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో త‌న‌ను ఏ క్ష‌ణ‌మైనా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని మిథున్‌రెడ్డి భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఏం జ‌రిగింది?

మునిసిపల్ ఎన్నిక‌ల నామినేష‌న్లు ప్రారంభ‌మైన తొలిరోజు.. గ‌త రెండు వారాల కింద‌ట పుంగ‌నూరులో పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయి. మిథున్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో రావ‌డంతోపాటు.. ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ వైపు ఆయ‌న కార్ల‌ను వేగంగా పోనివ్వ‌డం..ఇరు వ‌ర్గాలు రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడులు చేసుకున్న ఘ‌ట‌న‌లు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. దీంతో మిథున్‌రెడ్డిపై పోలీసులు హ‌త్యాయత్నం స‌హా అల్ల‌ర్లు, దోపిడీలు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. మొత్తంగా నాలుగు కేసులు న‌మోద‌య్యాయి. అయితే.. ఈ కేసుల్లో ప్ర‌ధాన నిందితుడిగా.. మిథున్‌రెడ్డి ఉన్నారు.

దీంతో ఆయ‌న త‌న‌పై న‌మోదు చేసిన కేసుల‌ను కొట్టివేయాల‌ని.. ఇదేస‌మ‌యంలో త‌న‌ను అరెస్టు చేయ‌కుండా పోలీసుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోర్టుకు విన్న‌వించారు. శుక్ర‌వారం సాయంత్రం హైకోర్టులో జ‌రిగిన విచార‌ణ‌లో న్యాయ‌మూర్తి.. మిథున్‌రెడ్డిని అరెస్టు చేయ‌కుండా పోలీసులను నిలువ‌రించ‌లేమ‌ని తేల్చి చెప్పారు. అయితే.. క్వాష్ పిటిష‌న్ల‌పై మాత్రం డిసెంబ‌రు 28న విచార‌ణ చేప‌డ‌తామ‌ని అన్నారు. దీంతో పోలీసులు ఏ క్ష‌ణ‌మైనా మిథున్‌రెడ్డిని అరెస్టు చేసే అవ‌కాశం ఏర్ప‌డింది. మ‌రోవైపు ఆదివారం స్థానిక సంస్థ‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో మిథున్ రెడ్డి ఆచూకీ గ‌ల్లంతు కావ‌డం.. ఆయ‌న ఫోన్ స్విచ్ఛాఫ్ రావ‌డం వంటివి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీశాయి.

This post was last modified on October 30, 2026 11:02 pm

Share

Recent Posts

ఇది నాకోసం కాదు – మన కోసం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ శ్రేణులు, నాయ‌కుల‌ను ఉద్దేశించి…

2 hours ago

బెజవాడలో వంగవీటి వన్‌మ్యాన్ షో

ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అయిన విజయవాడలో ఇప్పుడు పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవసం…

3 hours ago

తమన్ స్టేట్‌మెంట్‌లో ఇంత అతిశయమా

తమకు ఇష్టమైన దర్శకులను పొగుడుకోవడంలో సెలబ్రిటీలు అనుసరించే పద్ధతులు, వాడే పదాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కోసారి ఇవి అతిశయోక్తిగా మారి…

3 hours ago

పోలికల పర్వానికి శుభం కార్డు పడినట్టే

ఆదర్శ కుటుంబం ఏకె 47 షూటింగ్ జరుగుతున్న సమయంలో తెగ తిరిగిన ప్రచారం ఒకటుంది. అర్జున్ బ్లాస్ట్ జోన్ కథకు…

3 hours ago

రామ రావణులలో ఎవరికి ఎక్కువ సమయం

ఇంకో ఆరు రోజుల్లో రామాయణ పార్ట్ 1 విడుదల కానుంది. చాలా ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో రోజువారి…

4 hours ago

జాన్వికి డోర్స్ క్లోజ్ అయినట్లేనా?

‘పెద్ది’ సినిమా రిలీజై ఐదు నెలలు కావస్తోంది. ఆ సినిమా రిలీజ్ టైంలో జాన్వి కపూర్ పాత్రను తీర్చిదిద్దిన విధానం,…

4 hours ago