స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణులు, నాయకులను ఉద్దేశించి వర్చువల్‌గా సమీక్షలు నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన వరుసగా జిల్లాల వారీగా నాయకులతో మాట్లాడారు. ఆర్నబ్ తుఫాను అయిపోయిందని.. ఇప్పుడు దానిని మించిన పోలింగ్ తుఫాను రానుందని ఆయన చెప్పారు. ఆదివారం జరగనున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ కూడా ఒక రకంగా తుఫాను వంటిదేనని జగన్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. తుఫానును ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. అలానే ఇప్పుడు కూడా ఉండాలన్నారు.
మూడు అంచలుగా..
మూడు అంచలుగా నాయకులు వ్యవహరించాలని జగన్ పార్టీ నాయకులకు సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలింగ్ బూతులను ఇంచార్జ్‌లు, అధికారులు అనుమతి ఇచ్చిన వారు పదే పదే పరిశీలించాలన్నారు. బూత్ ఆక్రమణలు, ఓటర్లను బెదిరించడం వంటివాటిని ఉదాశీనంగా తీసుకోవద్దన్నారు. అవసరమైన పరిస్థితిలో ఎదిరించాలని సూచించారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిన్న విషయమే అయినా.. చూసీచూడనట్టు వదిలేయవద్దన్నారు. జిల్లాల్లో ముఖ్యంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఓటర్లను అధికార వర్గాలు బెదిరించే అవకాశం ఉందని అన్నారు. అలాంటి చోట ఓటర్లు భయంతో ఇంట్లోనే ఉండిపోతారని.. కాబట్టి వారిని పోలింగ్ కేంద్రం వరకు తీసుకువెళ్లే బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
This post was last modified on October 30, 2026 10:57 pm
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందా? ఆయన ఆచూకీ కూడా కనిపించడం…
ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అయిన విజయవాడలో ఇప్పుడు పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవసం…
తమకు ఇష్టమైన దర్శకులను పొగుడుకోవడంలో సెలబ్రిటీలు అనుసరించే పద్ధతులు, వాడే పదాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కోసారి ఇవి అతిశయోక్తిగా మారి…
ఆదర్శ కుటుంబం ఏకె 47 షూటింగ్ జరుగుతున్న సమయంలో తెగ తిరిగిన ప్రచారం ఒకటుంది. అర్జున్ బ్లాస్ట్ జోన్ కథకు…
ఇంకో ఆరు రోజుల్లో రామాయణ పార్ట్ 1 విడుదల కానుంది. చాలా ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో రోజువారి…
‘పెద్ది’ సినిమా రిలీజై ఐదు నెలలు కావస్తోంది. ఆ సినిమా రిలీజ్ టైంలో జాన్వి కపూర్ పాత్రను తీర్చిదిద్దిన విధానం,…