Political News

4600 కోట్ల న‌ష్టం… అయినా భ‌యం లేదు

తాజాగా సంభ‌వించిన ఆర్న‌బ్ తుఫాను కార‌ణంగా ఏపీలోని ప‌లు జిల్లాల్లో జ‌రిగిన న‌ష్టం.. సుమారు 4600 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ.. భ‌యం లేద‌ని.. అంద‌రినీ ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. కొబ్బ‌రి చెట్ల నుంచి ఇళ్ల వ‌ర‌కు, ప‌శువుల నుంచి ఇత‌ర జీవాల వ‌ర‌కు న‌ష్ట‌పోయిన ప్ర‌తి కుటుంబానికీ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. తుఫాను కార‌ణంగా జ‌రిగిన న‌ష్టం పై ప్రాథ‌మిక స‌మాచారం తెప్పించుకుని న‌ష్ట‌ప‌రిహారాన్ని అందించే కార్య‌క్ర‌మం చేప‌డ‌తామ‌న్నారు.

తాజాగా గురువారం సాయంత్రం వ‌ర‌కు ఆయ‌న కాకినాడ‌, తూర్పుగోదావ‌రి, అన‌కాప‌ల్లి వంటి తుఫాను ప్ర‌భావిత జిల్లాల్లో హెలికాప్ట‌ర్ ద్వారా చంద్ర‌బాబు ఏరియ‌ల్ స‌ర్వే చేప‌ట్టారు. తుఫాను బీభ‌త్సాన్ని ముందుగానే ఊహించామని చెప్పారు. టెక్నాల‌జీ సాయంతో ముందుగానే అంచ‌నా వేయ‌డం వ‌ల్ల‌.. ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూశామ‌న్నారు. ఈ విష‌యంలో అధికారుల‌ను చంద్ర‌బాబు అభినందించారు. స‌మ‌య స్ఫూర్తిగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లను ముందుగానే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించార‌ని ప్ర‌శంసించారు.

కేంద్రం నుంచి సాయం

ఆర్న‌బ్ తుఫాను ప్ర‌భావంతో అత‌లాకుత‌ల‌మైన ఏపీలోని జిల్లాల వివ‌రాల‌ను.. న‌ష్టాల‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వానికి పంప‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఇప్ప‌టికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈ విష‌యంపై చ‌ర్చించామ‌ని తెలిపారు. కేంద్రం కూడా సానుకూలంగా ఉంద‌న్నారు. స‌హాయ‌క బృందాల‌ను కూడా పంపుతోంద‌ని చెప్పారు. అలాగే న‌ష్టం అంచ‌నా వేసేందుకు కేంద్ర బృందాలు కూడా రానున్నాయ‌ని.. వారికి స‌మ‌గ్ర స‌మాచారం అందించాల‌ని అధికారుల‌ను చంద్ర‌బాబు ఆదేశించారు.

48 గంట‌లు త‌ప్ప‌దు!

కోన‌సీమ స‌హా విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లోని వంద‌లాది గ్రామాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఈ ప‌రిణామాల‌పై స్పందించిన చంద్ర‌బాబు దాదాపు 48 గంట‌ల్లో అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్‌ను పున‌రుద్ధ‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. కొన్ని ప్రాంతాల్లో 24 గంటల్లోనే విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని.. మ‌రికొన్ని గ్రామాల‌కు 48 గంట‌ల్లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న విద్యుత్ అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. అధికారులు స‌మ‌న్వ‌యంతోనే ప‌నిచేస్తున్నార‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

This post was last modified on October 30, 2026 11:04 am

Share

Recent Posts

చంద్రబాబు ఏమైనా జోక్ చేస్తున్నారా?

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు తాజాగా సీరియ‌స్ అయ్యారు. ఇంత సీరియ‌స్‌గా చెబుతున్నా.. మీకు అర్ధం కావ‌డం లేదా? లేక‌..…

41 minutes ago

వార‌ణాసి ఆ డేట్‌కే వ‌స్తుందా అండీ?

2027 సంవ‌త్స‌రంలో ఇండియ‌న్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో భారీ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. కానీ వాటిలో అత్య‌ధిక అంచ‌నాలున్న‌ది వార‌ణాసి మీదే…

2 hours ago

కొన్ని రోజులు పుల్లారెడ్డి స్వీట్లను మర్చిపోండి

తింటే గారెలు తినాలి.. అలానే పుల్లారెడ్డి స్వీట్స్ తినాలి! అంటూ దాదాపు 50 ఏళ్లుగా తెలుగు వారి నోటిని తీపి…

2 hours ago

జైలర్ జోరు ముగింపుకు వచ్చినట్టేనా

పెద్దగా ప్రమోషన్ల హడావిడి లేకుండా రిలీజ్ కు ముందు కాసింత నెగటివ్ వైబ్స్ తో వచ్చిన జైలర్ 2 అనూహ్యంగా…

5 hours ago

ఆదర్శ కుటుంబం టార్గెట్ పెద్దదే

త్రివిక్రమ్ రచనలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి కల్ట్ మూవీస్ చేశాడు విక్టరీ వెంకటేష్. ఐతే మాటల మాంత్రికుడి…

11 hours ago

చంద్రబాబుపై కేటీఆర్ సాఫ్ట్ కార్నర్… ఏంటి మార్పు?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది సామెత. అదిప్పుడు నిజమయ్యే సూచనలు కానవస్తున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు…

13 hours ago