పెద్దగా ప్రమోషన్ల హడావిడి లేకుండా రిలీజ్ కు ముందు కాసింత నెగటివ్ వైబ్స్ తో వచ్చిన జైలర్ 2 అనూహ్యంగా ఇండస్ట్రీ హిట్ కొట్టడం గురించి మీడియా వర్గాల్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులో దీనికొచ్చిన వసూళ్లు చూసి సన్ పిక్చర్స్ టీమే షాక్ కు గురయ్యిందట. హిట్ అవుతుందని ఊహించారు కానీ మరీ ఈ స్థాయిలో అరాచకం అనుకోలేదని అఫ్ రికార్డు ఒప్పేసుకుంటున్నారట. ఇప్పటిదాకా 750 కోట్లను దాటిన ముత్తువేల్ పాండియన్ జోరు తగ్గినట్టేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.
దానికి సమాధానం పూర్తిగా ఔనని చెప్పలేం. ఎందుకంటే తమిళంలో ఇప్పుడు కూడా చెప్పుకోదగ్గ క్రేజీ రిలీజులు లేవు. దీపావళి వరకు ఇంకా ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. తెలుగులో ఆదర్శ కుటుంబం కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే రజినీకాంత్ బొమ్మ ఏపీ తెలంగాణలో క్లైమాక్స్ కు వచ్చినట్టే. విశ్వక్ సేన్ కల్ట్ కూడా ఉంది కాబట్టి దానికొచ్చే రెస్పాన్స్ కూడా కీలకం కానుంది. జైలర్ 2తో పాటే వచ్చిన రణబాలి దాదాపు క్లోజింగ్ కు వెళ్ళిపోతోంది.
జైలర్ 2 ఇంకొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఉంటే వెయ్యి కోట్లను దాటేదనే కామెంట్ అబద్దం అయితే కాదు. నిజంగానే రజనీకాంత్ కు అంత స్టామినా ఉంది. అయితే దర్శకులు చేస్తున్న పొరపాట్ల వల్ల గత ఏడాది కూలి, ఇప్పుడు జైలర్ 2 రెండూ పెద్ద పొటెన్షియాలిటీ మిస్ చేసుకున్నాయి. కాకపోతే లోకేష్ కనగరాజ్ లాగా నెల్సన్ దిలీప్ కుమార్ మీద విమర్శలు రాలేదు. అభిమానులను పూర్తిగా సంతృప్తి పరిచాడన్న ఫీడ్ బ్యాక్ అతని ఇమేజ్ ని డ్యామేజ్ కాకుండా కాపాడింది.
ఇప్పుడీ సక్సెస్ రజని నెక్స్ట్ మూవీ ధర్మన్ మీద చాలా పాజిటివ్ గా ఉండబోతోంది. బిజినెస్ ఎంక్వయిరీలు జోరుగా ఉన్నాయట. సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అనుమానంగానే ఉంది. ఏది ఏమైనా విజయం సాధిస్తే చాలనుకుంటే జైలర్ 2 ఏకంగా ఇండస్ట్రీ హిట్ సాధించడం అనూహ్యం. వసూళ్లు చాలా బాగున్నప్పటికీ తెలుగు హక్కులు భారీ రేటుకి కొన్న కారణంగా పూర్తి బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్. ఇంకో రెండు రోజులు ఆగితే సోమవారానికి స్పష్టత వస్తుంది.
This post was last modified on October 30, 2026 12:03 am
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది సామెత. అదిప్పుడు నిజమయ్యే సూచనలు కానవస్తున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు…
తమిళనాడు సిఎం జోసెఫ్ విజయ్ వారసుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తన తొలి ప్రయత్నం సిగ్మాతో చేయడం అది దారుణంగా…
లోకనాయకుడు కమల్ హాసన్ లేట్ ఏజ్ లోనూ తనదైన ప్లానింగ్ తో వాహ్ అనిపిస్తున్నారు. ఇది కేవలం సినిమాల్లో నటించడం…
ఇంకా విడుదల తేడా రాకుండానే, స్ట్రీమింగ్ జరగకుండానే చిరంజీవి టాక్ షో 'మెగా వర్స్' అభిమానుల్లో పెద్ద చర్చకు దారి…
‘దసరా’ మూవీతో టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ శిష్యుడైన అతను.. డెబ్యూ…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ రెండేళ్ల క్రితం సంచలన ఆరోపణలు…