ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పార్టీ సింబల్ ఎంతో ముఖ్యం. అందుకే, పార్టీ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి రాజకీయ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు తమ పార్టీ గుర్తు ఇది అని మరీ మరీ చెబుతుంటారు నేతలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లకు పార్టీ గుర్తు మాత్రమే గుర్తుంటుంది కాబట్టి దానిని వారికి చేరువ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఒకే పార్టీ గుర్తును పోలిన గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ కేటాయిస్తూ ఉంటుంది.
అటువంటి సందర్భంలో కొందరు ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే, గుర్తింపు పొందిన అనేక రాజకీయ పార్టీలు తమ పార్టీ సింబల్ ను పోలిన సింబల్ ను వేరే అభ్యర్థులకు కేటాయించవద్దని విజ్ఞప్తి చేస్తుంటాయి. ఆ విధంగానే జనసేన పార్టీ కూడా రెండు గుర్తులను ఏ అభ్యర్థికి కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలోనే జనసేనకు ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. గ్లాస్ గుర్తును పోలిన పెన్ స్టాండ్, బకెట్ గుర్తులను వేరెవరికీ కేటాయించకుండా ఫ్రీజ్ చేయాలని ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు అవి రెండూ ఫ్రీ సింబల్స్ గా ఉన్నాయి.
కాగా, గతంలో జనసేనకు గాజు గ్లాసు(టంబ్లర్ గ్లాస్) గుర్తు విషయంలో కూడా జనసేన కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించిందని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో జనసేనకు గుర్తు కేటాయించామని కేంద్ర ఎన్నికల సంఘం కోర్టులో వాదనలు వినిపించింది. దీంతో, జనసేనకు గాజు గుర్తు ఫైనల్ అయింది.
This post was last modified on October 21, 2026 7:24 pm
ఈ మధ్య సెన్సార్ బోర్డు విన్యాసాలు మామూలుగా ఉండట్లేదు. చిత్ర విచిత్రమైన కారణాలు చెప్పి.. చిన్న సినిమాలకు చుక్కలు చూపిస్తున్నారు…
మునిసిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతల హడావుడి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత…
సౌత్ ఇండియన్ సినిమాలో సీక్వెల్, ఫ్రాంఛైజీల సక్సెస్ రేట్ తక్కువ అయినప్పటికీ.. అప్పుడప్పుడూ ఓ చిత్రం పెద్ద హిట్టయి ఆ…
రాయలసీమకు సాహిత్య, సాంస్కృతిక చరిత్ర వుంది. సినిమా వాళ్ళు, కొందరు రాజకీయ నాయకుల పుణ్యమాని ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరు పడిపోయింది.…
దసరా సెలవులు రణబాలికి చాలా ప్లస్ అయ్యాయి. రిలీజ్ రోజు ప్రాథమికంగా వచ్చిన పబ్లిక్ టాక్, సోషల్ మీడియా రెస్పాన్స్…
రిలీజ్ డేట్ల వాయిదాల గురించి నాగార్జున కొన్ని నెలలుగా సందర్భం దొరికినప్పుడంతా తన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. లెనిన్ నుంచి…