ఈ మధ్య సెన్సార్ బోర్డు విన్యాసాలు మామూలుగా ఉండట్లేదు. చిత్ర విచిత్రమైన కారణాలు చెప్పి.. చిన్న సినిమాలకు చుక్కలు చూపిస్తున్నారు సెన్సార్ సభ్యులు. కొన్ని సినిమాలకు రిలీజ్‌కు కొన్ని రోజుల ముంగిట టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా కల్పిస్తున్నారు. వానర, హే భగవాన్ లాంటి సినిమాలు ఇలాగే వనవీర, హే బల్వంత్ అని టైటిళ్లు మార్చుకున్నాయి. ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాకు కూడా టైటిల్ మార్చుకోకుంటే ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుందని అంటే.. ఆ టీం రాజీ పడకుండా అదే పేరుతో సినిమాను రిలీజ్ చేసింది.
ఇప్పుడు ఇంకో చిన్న సినిమాకు రిలీజ్ ముంగిట పేరు మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ఆకట్టుకున్న మౌళి హీరోగా ‘దొంగ నా కొడుకు’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నవంబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ లోపు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామని చూసిన టీంకు షాక్ తగిలినట్లు సమాచారం.
ఐతే ఈ సినిమాను సెన్సార్ స్క్రీనింగ్‌కు పంపగా.. టైటిల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారట.
బహుశా ‘దొంగ నా కొడుకు’ అన్నది తిట్టు కావడంతో దాన్ని టైటిల్‌గా పెట్టడాన్ని వ్యతిరేకించినట్లున్నారు. కానీ అదేం పెద్ద బూతైతే కాదు.. దీని మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం ఏంటో అర్థం కాని విషయం. ‘దొంగ నా కొడుకు’ సినిమాను ప్రొడ్యూస్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ అయినా.. ఇలాంటి ఇబ్బంది రావడం ఆశ్చర్యమే.
ఐతే ఎంత వారైనా సెన్సార్ బోర్డుకు తలవంచక తప్పదు కాబట్టి.. టైటిల్ మార్చుకోక తప్పని పరిస్థితి. దీంతో ‘నా కొడుకు దొంగ’ అని పేరు మార్చి సినిమాను రిలీజ్ చేయడానికి టీం రెడీ అయిపోయిందట. ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ గాలి వాటం కాదని రుజువు చేయాల్సిన స్థితిలో.. మౌళి ఆచితూచి ఈ సినిమాను ఎంచుకున్నాడు. ఈ చిత్రంతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ రోజే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాబోతోంది.
This post was last modified on October 21, 2026 7:20 pm
ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పార్టీ సింబల్ ఎంతో ముఖ్యం. అందుకే, పార్టీ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి రాజకీయ…
మునిసిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతల హడావుడి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత…
సౌత్ ఇండియన్ సినిమాలో సీక్వెల్, ఫ్రాంఛైజీల సక్సెస్ రేట్ తక్కువ అయినప్పటికీ.. అప్పుడప్పుడూ ఓ చిత్రం పెద్ద హిట్టయి ఆ…
రాయలసీమకు సాహిత్య, సాంస్కృతిక చరిత్ర వుంది. సినిమా వాళ్ళు, కొందరు రాజకీయ నాయకుల పుణ్యమాని ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరు పడిపోయింది.…
దసరా సెలవులు రణబాలికి చాలా ప్లస్ అయ్యాయి. రిలీజ్ రోజు ప్రాథమికంగా వచ్చిన పబ్లిక్ టాక్, సోషల్ మీడియా రెస్పాన్స్…
రిలీజ్ డేట్ల వాయిదాల గురించి నాగార్జున కొన్ని నెలలుగా సందర్భం దొరికినప్పుడంతా తన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. లెనిన్ నుంచి…