Political News

శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే

ఏపీలో సుమారు 12 కార్పొరేష‌న్ల స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. వీటిలో రెండేరెండు కార్పొరేష‌న్లకు సంబంధించిన చ‌ర్చ జోరుగా సాగుతోంది. అవే.. విశాఖ‌, విజ‌య‌వాడ‌. అందునా.. విజ‌య‌వాడ‌పైనే మెజారిటీ రాజ‌కీయ నేత‌ల దృష్టి ఉందంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. నిజంగానే విజ‌య‌వాడ గురించే ఇప్పుడు ఏ ఇద్ద‌రు నాయ‌కులు క‌లుసుకున్నా.. ఫోన్లు చేసుకున్నా చ‌ర్చిస్తున్నారు. అంత‌గా హాట్ టాపిక్ కావ‌డానికి కార‌ణం.. కేవ‌లం వంగ‌వీటి రాధా పోటీలో ఉన్నాడ‌నే కాదు.. మ‌రోవైపు మాజీ ఐపీఎస్ ఉండ‌డం!.

సాధార‌ణంగా ఎన్నిక‌లు అంటే. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్యే జ‌రుగుతుంది. కానీ.. విజ‌య‌వాడ‌లో ఇండిపెండెంటుగా బ‌రిలో నిలిచిన మాజీ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు.. విష‌యంలో ప్ర‌ధాన పార్టీ వైసీపీ ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తోందని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడు అవుతాడు కాబ‌ట్టి.. టీడీపీని కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఇటీవ‌ల కాలంలో వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును వైసీపీ కూడా కొన్నాళ్లుగా హైలెట్ చేస్తోంది. త‌ద్వారా టీడీపీ ఓటు బ్యాంకును త‌గ్గించాల‌న్న‌ది వైసీపీ వ్యూహం.

అందుకే.. సోష‌ల్ మీడియాలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు అనుకూలంగా పోస్టులు పెట్టిస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కాపు-క‌మ్మ సామాజిక వ‌ర్గాల మ‌ధ్య విభేదాలు సృష్టించేలా సాగుతున్నాయ‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నా.. ఇవేవీ ఆగ‌డం లేదు. వాస్త‌వానికి వైసీపీకి విజ‌య‌వాడ‌లో అభ్య‌ర్థులు ద‌క్క‌లేదు. మాజీ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి ఉన్నా.. ప్ర‌స్తుతం ఆమె పోటీ చేసేందుకు విముఖ‌త చూపించారు. త‌న ద‌గ్గ‌ర అంత సొమ్ములేద‌ని.. తాను పోటీచేయ‌న‌ని కూడా ఆమెతెగేసి చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ చివ‌రి నిమిషంలో త‌ప్ప‌క‌పోవ‌డంతోనే రాయ‌న బ‌రిలో దిగార‌ని కూడా అంటున్నారు. ఇక‌, ఎలానూ ఆమెను నామ‌మాత్రం చేసిన వైసీపీ.. ప‌రోక్షంగా ఏబీవీకి మ‌ద్ద‌తు ఇస్తోంద‌న్న‌ది కూట‌మి నాయ‌కుల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా..ప‌రోక్షంగా అయినా.. మ‌ద్ద‌తు ఇచ్చి.. ఏబీవీని గెలిపించుకోవ‌డం ద్వారా.. రెండు ర‌కాలుగా పంతం నెగ్గించుకోవాల‌ని భావిస్తోంద‌ని చెబుతున్నారు.

1) త‌మ పార్టీని కాద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన రాధాను ఓడించ‌డం. 2) టీడీపీలోని క‌మ్మ‌ల‌ను దూరం చేసి.. త‌ద్వారా విజ‌య‌వాడ‌లో ఓటు బ్యాంకును చీల్చ‌డం. ఈ రెండు వ్యూహాలే ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా వైసీపీ.. ఏబీవీకి ఇన్‌సైడ‌ర్‌గా స‌పోర్టు చేస్తున్న‌ట్టు చెబుతున్నారు.

This post was last modified on October 21, 2026 10:07 pm

Share

Recent Posts

లిటిల్ హార్ట్స్ మౌళికి టీవీ ఛానెల్ బ్లాక్‌మెయిల్

యూట్యూబ్‌లో ఫ‌న్నీ వీడియోలు చేసుకునే మౌళి.. నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌తో త‌న టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక…

42 minutes ago

ప్రేక్షకులను ఎక్కువ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు

ఒకప్పుడు ఆషామాషీ గ్రాఫిక్స్ తో సినిమా తీసినా చెల్లిపోయేది. స్క్రీన్ ప్లే మేజిక్, మంచి పాటలు పడితే ఎఫెక్ట్స్ లోపాలు…

45 minutes ago

గాజు గ్లాసుకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పార్టీ సింబల్ ఎంతో ముఖ్యం. అందుకే, పార్టీ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి రాజకీయ…

3 hours ago

‘దొంగ నా కొడుకు’ వద్దంటే… ‘నా కొడుకు దొంగ’

ఈ మధ్య సెన్సార్ బోర్డు విన్యాసాలు మామూలుగా ఉండట్లేదు. చిత్ర విచిత్రమైన కారణాలు చెప్పి.. చిన్న సినిమాలకు చుక్కలు చూపిస్తున్నారు…

3 hours ago

జిల్లాల పోరు జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చేనా?

మునిసిప‌ల్‌, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ వైసీపీ నేత‌ల హ‌డావుడి అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత…

4 hours ago

నరసింహా సీక్వెల్… నమ్మొచ్చా

సౌత్ ఇండియన్ సినిమాలో సీక్వెల్, ఫ్రాంఛైజీల సక్సెస్ రేట్ తక్కువ అయినప్పటికీ.. అప్పుడప్పుడూ ఓ చిత్రం పెద్ద హిట్టయి ఆ…

6 hours ago