వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు కనీస వసతులు కూడా ఇవ్వకుండా వారి సొమ్మును ఆబగా తినేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తపై పన్ను వేశారని.. రోడ్లను కూడా పట్టించుకోలేదని అన్నారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ జెండా రంగులు వేశారని విమర్శించారు. ఇలాంటి వారా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది.. అని ప్రశ్నించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ చంద్రబాబు ఘాటుగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల అరాచకాలు, ఏకగ్రీవాల పేరిట సాగిన దౌర్జన్యాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పట్లో కనీసం టీడీపీ నేతలను ఇంటి నుంచి కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. పునేఠా సీనియర్, నిష్పక్షపాతంగా ఆయన ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మేం పెత్తం దారులం కాదు. ప్రజా సేవకులం. అని వ్యాఖ్యానించారు. ప్రజలపై అంత ప్రేమే ఉంటే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని జగన్‌ను నిలదీశారు. గతంలో దేవాలయాలపై దాడులు జరిగాయని, బలవంతపు మత మార్పిడిలను ప్రోత్సహించారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సమూలంగా మార్పులు చేస్తున్నామన్నారు.
ఇక, ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగం. ఎవరూ ప్రజాస్వామ్యానికి అతీతులు కాదు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చరిత్ర సృష్టించారు.94 శాతం స్ట్రైక్ రేట్.. 57 శాతం ఓటు షేర్ ఇచ్చారు. వైసీపీ అరాచక పాలన, విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పు చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నాం. ఇప్పుడు కూడా అలానే తీర్పు ఉంటుంది. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on October 19, 2026 2:33 pm
ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. మాలా తెచ్చా పాలు అంటూ రామజోగయ్య శాస్త్రి…
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘటన ఇప్పుడు దేశ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ముంబయిలో ఫుట్…
సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని…
అనంతపురం జిల్లా అంటేనే రాజకీయాలకు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఈ జిల్లా…
బయోపిక్ ట్రెండ్ మళ్ళీ మొదలైపోయింది. మహానటి సావిత్రి టైంలో ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సిరీస్…
నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు పంపిణి చేయనుండటంతో పెద్ద రిలీజ్…