కడపజిల్లా మైదుకూరులో ఈ నెల 28న జరగాల్సిన స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘం స్టే విధించింది. దీనిని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. మరోసారి దీనికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. తాజాగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. కడప సహా అన్నమయ్య, దర్శి నియోజకవర్గాల పరిధిలో జరిగిన అల్లర్ల వ్యవహారంపై స్పందించారు.
ఆయా అల్లర్లకు కారణాలను అధికారులు తెలుసుకుంటారని.. దీనికి సంబంధించి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చామని పునేఠా తెలిపారు. అల్లర్లు జరగడం పట్ల తాము ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు. అధికారుల వైఫల్యం లేదని చెప్పారు. కొందరు వ్యక్తులు రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు జరిగాయని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని.. పోలీసు ఉన్నతాధికారులుసైతం ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించాన ని తెలిపారు.
కడప జిల్లా మైదుకూరులో జరగాల్సిన స్థానిక ఎన్నికలను నిలుపుదల చేస్తున్నట్టు పునేఠా వివరించారు. అక్కడ నామినేషన్ పత్రాలను కొందరు చింపి వేశారని.. అయినప్పటికీ చివరి నిమిషం కావడంతోఅభ్యర్తులు వాటినే అధికా రులకు ఇచ్చారని తెలిపారు. వాటిని పరిశీలించడం కష్టం అవుతుంది కాబట్టి.. ఆ ఒక్క చోట ఎన్నికలను నిలుపుద ల చేస్తున్నామని వివరించారు. అయితే.. దీనికిసంబంధించి కలెక్టర్ చేసిన సిఫారసులను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపారు. తదుపరి ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
శాంతియుతంగానే..
ప్రస్తుతం ఘర్షణలు చోటు చేసుకున్నది ఒకటి రెండు నియోజకవర్గాల పరిధిలోనేనని పునేఠా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ సజావుగా, శాంతి యుతంగానే సాగిపోయిందని తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో కూడా నామినేషన్ల ప్రక్రియ బాగానే జరిగిందని.. పోలీసులు తగిన భద్రత కల్పించారని.. హైకోర్టు ఆదేశాల మేరకు వారు వ్యవహరించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ను కూడా శాంతి యుతంగా పటిష్ట భద్రత నడుమ నిర్వహిస్తామని పునేఠా వివరించారు. దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.
This post was last modified on October 19, 2026 2:48 pm
అనంతపురం జిల్లా అంటేనే రాజకీయాలకు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఈ జిల్లా…
బయోపిక్ ట్రెండ్ మళ్ళీ మొదలైపోయింది. మహానటి సావిత్రి టైంలో ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సిరీస్…
జైలర్ 2 సక్సెస్ తర్వాత సోషల్ మీడియా యువతకు ఒక పెద్ద సందేహం వస్తోంది. మన సీనియర్లు కూడా ఇలా…
ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఇవ్వడం చట్టపరంగా నేరం. కానీ, మన దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ చట్టం…
‘ఇండియన్’ లాంటి ఆల్ టైం కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ తీసి గట్టిగానే తల బొప్పి కట్టించుకున్నారు శంకర్,…
వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు కనీస వసతులు కూడా ఇవ్వకుండా వారి…