పల్లె పండుగ కార్యక్రమం కింద కష్టపడి నిధులు తీసుకువచ్చి రోడ్డు నిర్మించామని.. అయితే.. వ్యక్తిగత అక్కసుతో రహదారిని ధ్వంసం చేసేశారని వైసీపీ నేతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉపక్రమించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ మేరకు ఆయన అత్యవసర ఆదేశాలు ఇచ్చారు.
ఏం జరిగింది?
తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం- పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా రహదారిని నిర్మించారు. 4 కోట్ల రూపాయలకు పైగా నిధులను వెచ్చించి నిర్మించిన ఈ రోడ్డును వైసీపీకి చెందిన ఓ నాయకుడు తన పొలం దున్నే ట్రాక్టర్‌తో దున్ని.. ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో అత్యవసరంగా ఆయన సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా 4 కోట్ల 75 లక్షల రూపాయలతో ఈ తారు రోడ్డును నిర్మించారు. అయితే.. వైసీపీ నేతలు సుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారు. ఈ మేరకు గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. వారిని వెంటనే అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజాధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అని అన్నారు. ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు.
This post was last modified on October 19, 2026 2:44 pm
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘటన ఇప్పుడు దేశ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ముంబయిలో ఫుట్…
సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని…
అనంతపురం జిల్లా అంటేనే రాజకీయాలకు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఈ జిల్లా…
బయోపిక్ ట్రెండ్ మళ్ళీ మొదలైపోయింది. మహానటి సావిత్రి టైంలో ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సిరీస్…
నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు పంపిణి చేయనుండటంతో పెద్ద రిలీజ్…
జైలర్ 2 సక్సెస్ తర్వాత సోషల్ మీడియా యువతకు ఒక పెద్ద సందేహం వస్తోంది. మన సీనియర్లు కూడా ఇలా…