Political News

జనసేనలోకి వంగవీటి రాధా

దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేనలో చేరబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో రాధా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో రాధాకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన సిద్ధాంతాల కోసం కలిసికట్టుగా పని చేద్దామని రాధాతో పవన్ అన్నారు.

విజయవాడ మేయర్ ఎన్నికల బరిలో రాధా నిలబడే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. రాధాతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ కూడా జనసేనలో చేరారు. తిరుపతి మేయర్ ఎన్నికల రేసులో ప్రణీత్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, బెజవాడ మేయర్‌ సీటును కూటమిలో జనసేనకు కేటాయిస్తారా? లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక, స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. సీఎం చంద్రబాబుతో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, లింగమనేని రమేశ్‌, హరిప్రసాద్‌ భేటీ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలోని విషయాలను వారు పవన్ కు తెలియజేశారు. సీట్ల సర్దుబాటుపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అధికారికంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న విషయంపై ప్రకటన వెలువడే అవకాశముంది.

జనసేనకు 15 శాతం సీట్లు కేటాయించాలని టీడీపీ భావిస్తోంది. అయితే, 35 శాతం కావాలని జనసేన నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక, విజయవాడలోని 86 డివిజన్లలో 35 స్థానాలు తమకు కేటాయించాలని జనసేన కోరుతోందని, 15 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉందని ప్రచారం జరుగుతోంది.

This post was last modified on October 14, 2026 7:33 pm

Share

Recent Posts

ప్రభాస్ ట్రీట్ ఇస్తే ఇలానే ఉంటుంది

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో కొత్తగా ఎవరు కలిసి పని చేసినా.. తన గురించి సోషల్ మీడియాలో తప్పనిసరిగా…

2 hours ago

ఏపీలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని…

3 hours ago

తీహార్ జైలుకు బొద్దింకలు

కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఢిల్లీ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ…

4 hours ago

ఎన్నికల్లో టికెట్ కోసం పెళ్లి

స్థానిక ఎన్నికలు అంటేనే అనేక చిత్ర విచిత్రాలు జరుగుతాయి. పంతాలు, పట్టింపులుంటాయి. అధికారం కోసం, గ్రామంలో పెత్తనం కోసం బంధాలను…

4 hours ago

కోర్టుకు రోజూ ర‌మ్మంటే జ‌గ‌న్ వ‌స్తారా?

కోర్టుకు రోజూ ర‌మ్మంటే జ‌గ‌న్ వ‌స్తారా? ఈ సందేహం రాజకీయ నాయ‌కుల‌ది కాదు.. సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తిది!. ఆశ్చ‌ర్యంగా అనిపించినా..…

5 hours ago

జైలర్ 2 వాతావరణం ఎలా ఉంది

ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ వస్తోందంటే దాని మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. మార్నింగ్ ఫస్ట్ షోనే…

5 hours ago