పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్తో కొత్తగా ఎవరు కలిసి పని చేసినా.. తన గురించి సోషల్ మీడియాలో తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో ఒక పోస్టు పెడుతుంటారు. తమ ఇంటి వంటలతో ప్రభాస్ అందించే విందును ఆరగించి.. అబ్బురపడుతూ, ఆయాసపడుతూ ఆ పోస్టు పెడుతుంటారు. తాను పని చేసే యూనిట్లో దాదాపుగా ముఖ్యులందరికీ తమ ఇంటి వంటలు రుచి చూపించకుండా ఉండడు ప్రభాస్. ప్రభాస్ వల్ల తమ డైట్ ప్లాన్లు దెబ్బ తిన్నాయని.. కడుపు ఉబ్బిపోయేలా తిండి పెట్టి చంపేస్తాడని సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు కోస్టార్లు.
ఈ జాబితాలోకి ఇంతకుముందే ఒక పేరు చేరింది. తనే.. ‘ఫౌజి’ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న ఇమాన్వి. ఆమె ‘ఫౌజి’ సినిమా సెట్స్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే ప్రభాస్ అందించిన విందు గురించి ఒక పోస్టు పెట్టింది. పదుల సంఖ్యలో వంటకాలతో ఉన్న ఒక వీడియోను షేర్ చేస్తూ.. కడుపు పేలిపోయేలా ఫుడ్ తిన్నట్లు కామెంట్ చేసింది ఇమాన్వి అప్పట్లో. ఇప్పుడు మరోసారి ఇమాన్వి పుట్టినరోజున భుక్తాయాసానికి గురి చేశాడు ప్రభాస్.
బోలెడన్ని నాన్ వెజ్, వెజ్ వంటకాలతో భారీ టేబుల్ మీద ప్రభాస్ ఏర్పాటు చేసిన విందుకు సంబంధించిన వీడియోను ఇమాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవన్నీ తిన్నాక కడుపుతో పాటు గుండె కూడా నిండిపోయిందని పేర్కొన్న ఇమాన్వి.. ప్రభాస్కు థ్యాంక్స్ చెప్పింది. తన కోస్టార్లకు ఏర్పాటు చేసే డిన్నర్లు మరీ ఈ రేంజిలో ఉంటాయా అని ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తుంటే.. ప్రభాస్ యూనిట్లో వాళ్లు ఫిట్నెస్ కాపాడుకోవడం ఎలా అంటూ సరదాగా ప్రశ్నిస్తున్నారు.
ఇక ‘ఫౌజి’ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని డిసెంబరు 3న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. అది సాధ్యపడట్లేదు. ఇప్పుడు కొత్తగా మార్చి డేట్ మీద కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. బడ్జెట్ రూ.500 కోట్ల పైమాటే. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం కథతో తెరకెక్కుతోంది. ఇందులో లవ్, వార్ ప్రధానాంశాలుగా ఉంటాయి.
This post was last modified on October 14, 2026 5:46 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని…
కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఢిల్లీ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ…
స్థానిక ఎన్నికలు అంటేనే అనేక చిత్ర విచిత్రాలు జరుగుతాయి. పంతాలు, పట్టింపులుంటాయి. అధికారం కోసం, గ్రామంలో పెత్తనం కోసం బంధాలను…
కోర్టుకు రోజూ రమ్మంటే జగన్ వస్తారా? ఈ సందేహం రాజకీయ నాయకులది కాదు.. సీబీఐ కోర్టు న్యాయమూర్తిది!. ఆశ్చర్యంగా అనిపించినా..…
ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ వస్తోందంటే దాని మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. మార్నింగ్ ఫస్ట్ షోనే…
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎక్కడికి అక్కడ నాయకులు పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున…