దేశ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ.. ఎల్‌టీటీ హ్యూమన్ బాంబు దాడిలో తమిళనాడులో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించి సోనియా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎల్‌టీటీఈ దాడిలో చనిపోయి ఉండకపోయినా.. ఆయనను చంపేసేవారు. దీనికి సంబంధించి ఏడాది పాటు ప్లాన్ జరిగింది.“ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విషయాలను ఆమె ఎక్కడా లిఖిత పూర్వకంగా చెప్పలేదు. తాజాగా తాను రాసుకున్న ఆత్మకథ విషయంపై రాహుల్, ప్రియాంకలతో చర్చించిన సందర్భంగా రాజీవ్ మరణం, దీనికి ముందు జరిగిన ఘటనలను ఆమె వారికి వివరించారు.
ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. తల్లి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను కూడా ఆయన పోస్టులో పెట్టారు. ఈ వ్యాఖ్యల ప్రకారం.. రాజీవ్ గాంధీ.. ఎల్‌టీటీఈ దాడిలో కాకపోయినా.. దీని తర్వాత అయినా చనిపోయి ఉండేవారని, ఆయన జీవించి ఉంటే తమకు అధికారం దక్కదని భావించిన అప్పటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని ఉదంతాలను ఆమె ప్రస్తావించారు. ఆమె చెప్పిన విషయాలు యథాతథంగా..
1) రాజీవ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. దేశవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారు. అయితే.. అప్పటి ప్రబుత్వం ఆయనకు సరైన భద్రత కల్పించకపోగా.. ఉన్న సిబ్బందిని తొలగించారు. రాజీవ్‌కు ఓ లక్షణం ఉంది. ఆయన ప్రజల్లో పర్యటిస్తే.. ఓపెన్ టాప్ జీపులోనే వెళ్తారు. దీంతో కొందరు ఆయనపై రాళ్ల దాడి చేశారు. ఇది చాలా భయంకర ఘటన. ఇంటెలిజెన్స్ వర్గాలకు ఈ విషయం తెలిసి కూడా చెప్పలేదని తర్వాత వెల్లడైంది.
2) ఆ సమయంలో రాహుల్ కూడా ఆయన వెంటే ఉన్నారు. ఈ దాడిని రాహుల్ ప్రత్యక్షంగా చూసి భయకంపితు డయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత.. అన్నీ వివరంగా చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. కానీ, రాజీవ్ భయపడలేదు. ప్రజల కోసం ఏమైనా చేసేందుకు తను సిద్ధమేనని అన్నారు. ఆయన ధైర్యం.. సాహసం.. ఒకవైపు, పిల్లల ఆవేదన మరోవైపు నన్ను కలచి వేసింది.
3) నాకు అర్థమైంది ఒక్కటే. ప్రజల కోసం దేశం కోసం గాంధీల కుటుంబం ఇంత చేస్తుందని నేను అనుకోలేదు. ఎవరూ ఇలా ఆలోచిస్తారని కూడా భావించలేదు. కానీ, గాంధీల కుటుంబం మాత్రమే ఇలా చేస్తుంది. ఇప్పుడు రాహుల్‌గాంధీ భద్రతను కూడా తొలగించారు. “ఏమైనా కానీ.. అని నువ్వు(రాహుల్) అంటున్నావు. కానీ, “ అంటూ సోనియా మాటలు నిలిపివేశారు. ఇక, ఈ విషయంపై రాహుల్ స్పందిస్తూ.. తన భద్రత తొలగించడం వెనుక కూడా వ్యూహం ఉందన్నారు. అయినా వెన్ను చూపేదిలేదన్నారు.
This post was last modified on November 24, 2026 2:51 pm
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చకు దారితీసిన అంశం. సుప్రీంకోర్టులోనూ విచారణకు కీలక ప్రాధాన్యం ఏర్పడిన అంశం.. తమిళనాడులోని `తిరుపరంకుండ్రం`. గత…
అమరన్ వచ్చినప్పుడు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామీ పేరు మారుమ్రోగింది. ఒక వీర సైనికుడి బయోపిక్ ని ఎమోషనల్ గా…
ట్రాఫిక్‌లో చిక్కుకుంటే చాలు.. కొందరు వాహనదారులు ఎలాగైనా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో రోడ్లపై ఖాళీ లేకపోతే ఫుట్‌పాత్‌లను…
సహజంగా ఒక పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వంలో ఉంటే.. అదేపార్టీకి చెందిన గత నాయకులను విమర్శించడం ఎక్కడా కనిపించదు. గతంలో…
ఒకప్పుడు భారతీయ శీతల పానీయాల మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోల్డ్ స్పాట్ మరోసారి వార్తల్లో నిలిచింది. దాదాపు 26…
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటారు. అదే విధంగా ఏ టైంలో జరగాల్సిన రీమేక్…