సహజంగా ఒక పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వంలో ఉంటే.. అదేపార్టీకి చెందిన గత నాయకులను విమర్శించడం ఎక్కడా కనిపించదు. గతంలో ఒకే పార్టీ ప్రభుత్వం కొనసాగినప్పుడు.. తర్వాత వచ్చే అదే పార్టీ నాయకులు సమర్థించడమైనా చేస్తారు.. లేకపోతే సైలెంట్‌గా అయినా ఉంటారు. కానీ.. ఇప్పటి వరకు లేనిది.. తాజాగా రేవంత్ రెడ్డి.. ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
వైఎస్ హయాంలోనే తెలంగాణ నీటికి గండిపడిందని ఆరోపించారు. రాయలసీమకు, పల్నాడుకు కృష్ణానీటిని తరలించుకుపోయే పన్నాగం ఆనాడే జరిగిందని ఆరోపిస్తూ.. దీనికి కర్త, కర్మక్రియ హరీష్‌రావేనని.. వైఎస్ దగ్గర మార్కులు వేయించుకు నేందుకు తన మంత్రిపదవిని కాపాడుకునేందుకు ఏపీకి నీటిని దోచిపెట్టారని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో తాజాగా వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును కూడా తెరమీదికి తీసుకురావడం ద్వారా రేవంత్ రెడ్డి సంచలనమే సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహారాన్ని ఎప్పుడు ప్రస్తావించినా.. పన్నెత్తు విమర్శ కూడా చేయలేదు. పైగా ఆయన పెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్‌మెంటు వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. అంతేకాదు.. వైఎస్‌పై ఎప్పుడూ రేవంత్ సానుకూల ధోరణితోనే ఉన్నారు. కానీ, తాజాగా తెలంగాణకు అన్యాయం చేయడంలో వైఎస్ పాత్రను విస్మరించలేమని చెప్పడం కాంగ్రెస్‌వాదుల్లో కూడా సంచలనంగా మారింది. మరి దీనికి రీజనేంటి? ఎందుకు? అనేది ఆసక్తి పరిణామం.
ప్రస్తుతం తెలంగాణలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో గత పదేళ్ల కేసీఆర్ పాలనను టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. దీనికి ప్రతిగా.. అటు కేసీఆర్ అండ్ కో కూడా ఎదురు దాడి చేస్తోంది. తమ హయాం కంటే కూడా.. గత పాలకుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు.. అప్పటి నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో రేవంత్ వ్యవహారం ఒకరకంగా చర్చకు దారితీసింది. “చెబితే అన్ని విషయాలు చెప్పాలి. కొన్ని చెప్పి మిగిలిన వారిని వదిలేస్తే.. ఇబ్బందులు తప్పవు“ అని ఆలోచించినట్టుగా ఉన్నారు. దీంతో వైఎస్ హయాంలో ఏం జరిగిందో కూడా పూసగుచ్చి చెప్పారు.
ఏంటి లాభం?
తద్వారా.. తనవారే అయినా.. తన పార్టీనాయకులే అయినా.. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్న సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. తెలంగాణ సమాజంలో తన ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా కనిపిస్తోంది. అదేసమయంలో తాను చెబుతున్న వాస్తవాలను నిరూపించుకునే ఉద్దేశం ఉందన్న భావన కూడా వ్యక్తమవుతోంది. కేవలం ఒక పక్షానికే పరిమితం చేయకుండా.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పక్షమైనా తన దృష్టిలో ఒక్కటే అన్న విధంగా రేవంత్ వ్యవహరించడం ద్వారా తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ తెరమీదికి వచ్చింది. కాగా, వైఎస్ పేరును లాగడంపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం నాయకులు మౌనం వహించారు.
This post was last modified on November 24, 2026 10:39 am
ట్రాఫిక్‌లో చిక్కుకుంటే చాలు.. కొందరు వాహనదారులు ఎలాగైనా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో రోడ్లపై ఖాళీ లేకపోతే ఫుట్‌పాత్‌లను…
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటారు. అదే విధంగా ఏ టైంలో జరగాల్సిన రీమేక్…
ఓమ్ విడుదలయ్యాక సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ పనితనం గురించి మ్యూజిక్ లవర్స్ లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ…
మూడు వారాల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల సినిమా ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఒక…
త్వరలోనే తెలంగాణాకు మరో డిప్యూటీ సీఎం వస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలిగించినప్పటి…
పెద్ది సినిమాలో తన పాత్రను ప్రెజెంట్ చేసిన తీరు గురించి బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ఈ మధ్య కాఫీ…