Political News

ఈడీ విచారణకు అవినాష్ రెడ్డి… ట్రంకు పెట్లలో పత్రాలు

వంద‌లు కాదు.. ఏకంగా కొన్ని వేల పేజీల‌కు పైగా బ్యాంకు ఖాతా లావాదేవీల వివ‌రాల‌తో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బుధ‌వారం ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ ) అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యానికి రావాల‌ని.. విచార‌ణకు స‌హ‌క‌రించాల‌ని అధికారులు ఇచ్చిన నోటీసుల మేర‌కు క‌డ‌ప‌ ఎంపీ బుధ‌వారం వారి ముందుకు వెళ్లారు. అయితే..ఆయ‌న నాలుగు ట్రంకు పెట్టెల్లో వేల పేజీల్లో బ్యాంకు ఖాతాల వివ‌రాల‌ను అందించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.ఈ  కేసు అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో ఆయ‌న హ‌త్య‌కు 40 కోట్ల రూపాయ‌ల మేర‌కు సుపారీ ఇచ్చార‌ని సీబీఐ, ఈడీ అధికారులు గుర్తించారు. ఈ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఎవ‌రు ఇచ్చారు? ఏయే మార్గాల ద్వారా ఆ సొమ్ములు చేతులు మారాయి? అనే వివ‌రాల‌పై కూపీ లాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే ఏ1, ఏ2, ఏ3లుగా ఉన్న నిందితుల‌ను ఈడీ అధికారులు విచారించారు.

వారు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచార‌ణ‌కు పిలిచారు. బ్యాంకు లావాదేవీల‌ను తీసుకురావ‌ల‌ని.. అవి కూడా 2019 నుంచి జ‌రిగిన బ్యాంకు లావాదేవీలే అయి ఉండాల‌ని ష‌ర‌తు విధించారు. దీంతో 3 బ్యాంకుల‌కు సంబంధించిన లావాదేవీల‌తో కూడిన ప‌త్రాల‌ను తీసుకుని అవినాష్ రెడ్డి అధికారుల ముందు హాజ‌ర‌య్యారు. స‌ద‌రు సొమ్ముతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న చెప్పారు.

కాగా, 2019 నుంచి బ్యాంకు స్టేట్‌మెంట్లు ఈడీ అధికారులకు అందజేసిన నేప‌థ్యంలో వీటిని ప‌రిశీలించేందుకే అధికారులు రెండు నుంచి నాలుగు రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. మొత్తం రూ.40 కోట్ల సుపారీతో పాటు సంఘటనా స్థలంలో ఆధారాల చెరిపివేతపైనా ఈడీ అధికారులు అవినాష్ రెడ్డిని ప్ర‌శ్నించారు. అయితే.. తాను ఈ విష‌యంలో ఇప్ప‌టికే విచార‌ణ‌కు స‌హ‌క‌రించాన‌ని, ప్ర‌స్తుతం స్థానిక ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో తాను ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల్సి ఉంటుంద‌ని ఆయ‌న‌ చెప్పారు. 

This post was last modified on October 14, 2026 7:59 pm

Share

Recent Posts

జనసేనలోకి వంగవీటి రాధా

దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేనలో చేరబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న…

33 minutes ago

ప్రభాస్ ట్రీట్ ఇస్తే ఇలానే ఉంటుంది

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో కొత్తగా ఎవరు కలిసి పని చేసినా.. తన గురించి సోషల్ మీడియాలో తప్పనిసరిగా…

2 hours ago

ఏపీలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని…

4 hours ago

తీహార్ జైలుకు బొద్దింకలు

కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఢిల్లీ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ…

5 hours ago

ఎన్నికల్లో టికెట్ కోసం పెళ్లి

స్థానిక ఎన్నికలు అంటేనే అనేక చిత్ర విచిత్రాలు జరుగుతాయి. పంతాలు, పట్టింపులుంటాయి. అధికారం కోసం, గ్రామంలో పెత్తనం కోసం బంధాలను…

5 hours ago

కోర్టుకు రోజూ ర‌మ్మంటే జ‌గ‌న్ వ‌స్తారా?

కోర్టుకు రోజూ ర‌మ్మంటే జ‌గ‌న్ వ‌స్తారా? ఈ సందేహం రాజకీయ నాయ‌కుల‌ది కాదు.. సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తిది!. ఆశ్చ‌ర్యంగా అనిపించినా..…

5 hours ago