స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను డెడికేటెట్ కమిషన్ సర్వే ప్రకారం అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర మంత్రి వర్గం అత్యవసరంగా భేటీ అయింది. ఎనిమిది కేటగిరీల్లో రిజర్వేషన్ల అమలు ఖరారు చేసింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన మేరకు బీసీలకు మున్సిపల్ ఛైర్మన్‌లలో 33.02 శాతం, మేయర్లలో 35.29 శాతం సీట్లు ఖరారు చేశారు. జడ్పీ ఛైర్మన్ పదవుల్లో 23.08 శాతం, ఎంపీపీల్లో 24.60 శాతం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. సర్పంచు పదవుల్లో బీసీలకు 27.95 శాతం దక్కనున్నాయి. పంచాయతీ వార్డు మెంబెర్స్‌లో 26.73 శాతం, ఎంపీటీసీ 25.55 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ లెక్క ప్రకారం…
17 కార్పొరేషన్ మేయర్లకు గాను 6 పదవులు బీసీలకు దక్కుతాయి. 106 మున్సిపల్ చైర్మన్లకు గాను 35 సీట్లు బీసీలకు కేటాయించడం జరుగుతుంది. 28 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాల్లో 7 స్థానాలు బీసీలకు ఇస్తారు. 661 ఎంపీపీలకు గాను 152, గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు 13,351 వుండగా 3128 చోట్ల బీసీలు పోటీ చేస్తారు. 1,33,910 వార్డు మెంబర్లకు 30,315 స్థానాలు, 9913 ఎంపీటీసీల్లో 2400 సీట్లు బీసీలకు కేటాయించనున్నారు. 3884 మున్సిపల్ వార్డుల్లో 1273 దక్కుతాయి.
ఇవి కాకుండా అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ 34 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కనుక ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన స్థానాలకంటే బీసీలకు అదనంగా మరిన్ని స్థానాలు లభించనున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రాజకీయాధికారం సాధించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారని బీసీ సంఘాలు చెబుతున్నాయి.
This post was last modified on October 10, 2026 4:31 pm
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…