Movie News

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు అభ్యంతర పెట్టి రిలీజ్ రోజు వరకు టెన్షన్ పెట్టడం, టైటిల్స్ మార్చమని ఒత్తిడి చేయడం గురించి పలువురు దర్శక నిర్మాతలు ఓపెన్ గానే ప్రెస్ మీట్లలో బయట పడటం చూస్తున్నాం. నిన్న కోన వెంకట్ తో మొదలుపెట్టి గత ఏడాది దండోరా టీమ్ వరకు తమ సాధకబాధలు చెప్పుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఈ వ్యతిరేకత ఎక్కడిదాకా వెళ్తుందనేది అసలు ప్రశ్న.

సెన్సార్ బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. దానికో నిర్దిష్టమైన విధి విధానాలున్నాయి. కాలానికి అనుగుణంగా అందులో పని చేసే వాళ్ళ సినిమా చూసే దృక్పథం మారుతూ రావడం వల్ల రకరకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇది ఇప్పటిది కాదు. స్వర్గీయ ఎన్టీఆర్ ‘బొబ్బిలి పులి’ సెన్సార్ చిక్కుల్లో పడితే దర్శక నిర్మాతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా నానా అగచాట్లు పడి, కోర్టుకు వెళ్లి, రివైజింగ్ కమిటీ చుట్టూ తిరిగి చివరికి ఎలాగోలా సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. అది బ్లాక్ బస్టర్ కావడం వేరే సంగతి.

మణిరత్నం ‘బొంబాయి’ టైంలో రేగిన కాంట్రవర్సీలకు లెక్కే లేదు. శివసేన లాంటి రాజకీయ పార్టీలు, కొన్ని సామజిక వర్గాల మత పెద్దలు ఎన్నో వివాదాలు సృష్టించారు. సెన్సార్ సైతం బోలెడు అభ్యంతరాలు, కట్స్ చెప్పింది. నెలలు గడిచిన తర్వాతే మోక్షం దక్కింది. బ్లాక్ అండ్ వైట్ జమానాలో ‘మాల పిల్ల’ నుంచి మొన్నటి అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ దాకా ఇలా చెప్పుకుంటూ పోతే పదులు వందలు కాదు వేలల్లో ఉదాహరణలు కనిపిస్తాయి. ఇవి కొత్తగా వచ్చినవి కాదు, ఇక్కడితో ఆగేవి కాదు.

పరిశ్రమ పెద్దలు ఏమైనా పూనుకుని సెన్సార్ లో మార్పుల కోసం నడుం బిగించినా ఇప్పటికిప్పుడు మార్పు రావడం అంత ఈజీ కాదు. కేవలం సర్టిఫికెట్ ఇవ్వడం మాత్రమే సదరు సంస్థ బాధ్యత కాదు. థియేటర్లకు వచ్చే జనాల మానసిక స్థాయి లేదా సమాజం మీద సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే కోణంలో సీరియస్ గా ఆలోచిస్తారు. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఎన్నిసార్లు ఈ విషయం మీద యుద్దాలు చేశారో లెక్క లేదు. సో సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత వచ్చినా ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం అయితే ఖచ్చితంగా కాదు.

This post was last modified on October 9, 2026 11:31 am

Share

Recent Posts

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

1 hour ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

1 hour ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

2 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

3 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

3 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

6 hours ago