భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ నుండి మాటల తుటాలు పేలుతున్నాయి. మస్క్ కు చెందిన స్టార్లింక్ సేవలను ఇండియాలో ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అంబానీ అండ్ కో అడ్డుకుంటుందని భావిస్తున్న ఆయన విమర్శలకు దిగారు. దీంతో మస్క్, అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్ స్టార్ట్ అయ్యింది.
స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రారంభించకుండా కొందరు ఒలిగార్చ్‌లు అడ్డుకుంటున్నారని ఆరోపించిన మస్క్ ఇది భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా భారతదేశానికి అంబానీనే అసలైన బాసా… అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించడం సంచలనం సృష్టిస్తోంది. రిలయన్స్ జియో ఏకఛత్రాధిపత్యాన్ని కాపాడుకోవడానికే దొడ్డిదారిన స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని మస్క్ భావిస్తున్నారు. అదే ఉద్దేశ్యంతో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ప్రభుత్వం నేరుగా లైసెన్స్ ఫీజు ద్వారా శాటిలైట్ కంపెనీలకు ఇంటర్నెట్ సేవలకు అనుమతించాలని మస్క్ ప్రతిపాదిస్తున్నాడు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయకూడదని వాదిస్తున్నాడు. తనకు లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతున్నాడు. ఇందుకు భారత ప్రభుత్వం సరైన సమాధానమే ఇచ్చింది. జాతీయ భద్రతా కారణాల వల్లే స్టార్‌లింక్ కు ఇంకా లైసెన్స్ మంజూరు చేయలేదని, ఈ ప్రక్రియ అధికారుల పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది. అయితే రిలయన్స్ జియో ఎండీ ఆకాష్ అంబానీ మాత్రం మస్క్ కామెంట్స్ పై స్పందించడానికి తిరస్కరించారు.
విదేశీ కంపెనీలకు నేరుగా స్పెక్ట్రమ్ కేటాయించే ప్రతిపాదనలను ముఖేష్ అంబానీ తప్పు పడుతున్నారు. దీనివల్ల స్థానిక టెలికమ్ కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయని తన వాదన వినిపిస్తున్నారు. ఇప్పటికే భారత కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని, విదేశీ కంపెనీలు వస్తే ఇక కోలుకోవడం కష్టమని చెబుతున్నాడు. అసలు విషయం ఏమిటంటే… 2030 నాటికి భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్ విలువ 1.9 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అందుకే ఎలాగైనా సరే ఇండియాలో ప్రవేశ్నించాలని మస్క్ ప్రయత్నం చేస్తున్నాడు. మస్క్ వస్తే తనకు మస్కా తప్పదని అంబానీ కిందా మీదా పడుతున్నాడు. మరి కేంద్రం ఏమి చేస్తుందో చూడాలి…..
This post was last modified on October 9, 2026 6:34 am
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…