మొన్న విడుదలైన అన్ని సినిమాల్లో ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది ఆకాశంలో ఒక తారకే. దుల్కర్ సల్మాన్ హీరోగా సాత్విక వీరవల్లిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందించిన ఈ ఎమోషనల్ బయోపిక్ కు సోషల్ మీడియా మద్దతు బలంగా దక్కింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి హత్తుకునే డ్రామా చూడలేదంటూ అధిక శాతం ఆడియన్స్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే విధంగా కథా కథనాలున్నాయని మెచ్చుకున్నారు.
ఇదంతా ఓకే కానీ బుకింగ్స్ పరంగా చూసుకుంటే ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఓం కన్నా ఆకాశంలో ఒక తార కొంచెం నెమ్మదిగా ఉంది. వాటిలో ఉన్న కమర్షియల్ అంశాలు, ట్రెండీ ఎలిమెంట్స్ దుల్కర్ మూవీలో లేవు. దీంతో సహజంగా మాస్ ఆడియన్స్ స్లోగా కదులుతున్నారు. తెలుగు వెర్షన్ కు గత ఇరవై నాలుగు గంటల్లో 70 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా తమిళ మలయాళ వెర్షన్లు ఇంకో 30 వేలు నమోదు చేశాయి. మూడు భాషలు కలిపితే లక్షకు పైగా టికెట్లు చాలా మంచి నెంబర్.
ఇవాళ రేపు వీకెండ్ ఆకాశంలో ఒక తారకి చాలా కీలకం కానుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను కనక కదిలించగలిగితే ఈజీగా పోటీలో నెగ్గుకురావచ్చు. టికెట్ రేట్ల పెంపు లాంటి పంచాయితీలు లేవు కాబట్టి ఇరుముడి లాగా ఆ అడ్వాంటేజ్ ని ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి. అయితే జానర్ కున్న పరిమితులు, సాధారణ జనాలు కోరుకునే ఎంటర్ టైన్మెంట్ ఆకాశంలో ఒక తారలో కొంచెం తక్కువగా ఉండటం వల్ల పికప్ ప్రతి షోకు మెల్లగా పెరుగుతూ వెళ్తోంది తప్ప అనూహ్యంగా కాదు.
కంటెంట్ పరంగా నెగటివ్ రిమార్క్స్ రాకపోవడం ఆకాశంలో ఒక తారకు పెద్ద అడ్వాంటేజ్ కానుంది. అయితే కమర్షియల్ గా పెద్ద స్థాయిలో వెళ్తుందా లేదానేది ఒక వారం ఆగితే కానీ క్లారిటీ రాదు. ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఓమ్ ప్రస్తుతం కొంత ముందంజలో ఉన్నాయి కాబట్టి ఈ మూడు సినిమాల మీద ఒకరి మీద మరొకరి ప్రభావం తప్పకుండా ఉంటుంది. లెక్కల సంగతి పక్కనపెడితే టాలీవుడ్ లో తన ట్రాక్ రికార్డు పట్ల దుల్కర్ సల్మాన్ మటుకు పిచ్చ హ్యాపీగా ఉన్నాడు.
This post was last modified on November 21, 2026 1:14 pm
ఏపీ మండలాధ్యక్ష ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం.. కనబరిచింది. 2024లో వచ్చిన స్ట్రయిక్ రేట్‌ను ఇప్పుడు కూడా కొనసాగించింది. ఏపీలోని మొత్తం…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు.. టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.…
కల్వకుంట్ల కవిత...ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చే మరో పేరు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ సాధనలో…
మూడేళ్ళ క్రితం మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సంక్రాంతి రేసులో తలపడి తేజ సజ్జ అంత…
కొన్ని రోజుల ముందు ‘అక్క’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక చిట్ చాట్‌లో.. రాధిక ఆప్టే తెలుగు…
ఏపీ బీజేపీలో కొన్నాళ్లుగా అసంతృప్తితోనే నాయకులు ముందుకు సాగుతున్నారు. పార్టీలో ఏం జరుగుతోందో.. తమకు అర్థం కావడం లేదని కొన్నాళ్లుగా…