సినిమా రిలీజ్ తర్వాత పెట్టే సక్సెస్ మీట్‌ల గురించి నిన్న ఇద్దరు హీరోలు క్రేజీ కామెంట్స్ చేశారు. రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సక్సెస్ మీట్స్ పెట్టడం కామన్ అయిపోయిందని, అందుకే తన సినిమాలకు అలాంటి ఈవెంట్లు చేయడం మానేశానని, ‘ఈఎన్ఈ రిపీట్’ నిజంగా సక్సెస్ అయింది కాబట్టే ఈవెంట్ పెట్టుకున్నామని అన్నాడు విశ్వక్సేన్.
మరోవైపు నేచురల్ స్టార్ నాని తాను ప్రొడ్యూస్ చేసిన ‘అలియాస్ రుక్మిణీ’కి సంబంధించిన వేడుకలో మాట్లాడుతూ.. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్‌లు జోక్‌గా మారిపోయిన ఈ రోజుల్లో.. రిలీజ్‌కు ముందే తాము బ్లాక్ బస్టర్ పార్టీ చేసుకుంటున్నామని కామెంట్ చేశాడు. ఐతే నాని ఊరికే ఏమీ ఈ మాట అనలేదని అర్థమవుతోంది. ఈ సినిమాకు తెగే ఫస్ట్ టికెట్ నుంచే లాభాలు రాబోతున్నాయట. ఈ విషయాన్ని నిర్మాతగా నాని ధ్రువీకరించాడు.
‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ టికెట్‌ను ఈ పార్టీలోనే నాని అమ్మకానికి పెట్టాడు. టీంలో ఒకరు డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నారు. ఇది తన ఫస్ట్ లాభం అని నాని చెప్పడం విశేషం. ఇక్కడి నుంచే తెగే ప్రతి టికెట్ మీద వచ్చే ఆదాయం తమకు ప్రాఫిటే అని నాని చెప్పాడు. దీన్ని బట్టి ‘అలియాస్ రుక్మిణీ’ మీద పెట్టిన బడ్జెట్ అంతా నాన్-థియేట్రికల్ రైట్స్ నుంచే నానికి రికవర్ అయిపోయిందన్నమాట. థియేటర్ల నుంచే వచ్చేదంతా లాభమే అనుకోవాలి.
ఈ సినిమాకు మంచి బజ్‌యే ఉంది కాబట్టి.. కలెక్షన్లు బాగానే వస్తాయని భావిస్తున్నారు. ఈజీగా నాని 20 కోట్లకు తక్కువ కాకుండా లాభాలు అందుకునే అవకాశముంది. నితిన్ సరసన బాలీవుడ్ భామ ఆఫియా సయ్యద్ నటించిన ఈ చిత్రాన్ని ‘దండోరా’ దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ రూపొందించాడు. డిసెంబరు 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 21, 2026 3:16 pm
ఎప్పుడైతే ఫౌజీ డిసెంబర్ 4 వదిలేసుకుందో అప్పటి నుంచి దాని మీద పోటీ పెరిగి ఇప్పుడు ఏకంగా అరడజను సినిమాలు…
మొన్న విడుదలైన అన్ని సినిమాల్లో ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది ఆకాశంలో ఒక తారకే. దుల్కర్ సల్మాన్ హీరోగా సాత్విక…
ఏపీ మండలాధ్యక్ష ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం.. కనబరిచింది. 2024లో వచ్చిన స్ట్రయిక్ రేట్‌ను ఇప్పుడు కూడా కొనసాగించింది. ఏపీలోని మొత్తం…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు.. టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.…
కల్వకుంట్ల కవిత...ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చే మరో పేరు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ సాధనలో…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సెటైర్లు వేశారు. ఈ సారి జాతీయ…