Political News

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ ఎగ్గొట్టి ఉంటే.. వారిని విచారించేందుకు, అరెస్టు చేసేందుకు జీఎస్టీ అధికారుల‌కు ప్ర‌త్యేక ప‌వ‌ర్ ఉండేది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఏపీలో వైసీపీ పాల‌న స‌మ‌యంలో ప్ర‌స్తుత చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే (టీడీపీ) ప్ర‌త్తిపాటి పుల్లారావు కుమారుడిని అరెస్టు చేశారు. కానీ, ఇప్పుడు అలా చేయ‌డానికి వీల్లేదు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ భేటీ జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు.

  1. అరెస్టుల‌కు చెక్‌: నిన్న‌టి వ‌ర‌కు వ్యాపారుల‌కు కంట్లో న‌లుసుగా ఉన్న ఈ విష‌యంపై కౌన్సిల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎంత మొత్తంలో ప‌న్నులు ఎగ‌వేసినా.. వెంట‌నే జీఎస్టీ అధికారులు స‌ర‌దు వ్యాపారుల‌ను, పారిశ్రామిక వేత్త‌ల‌ను కూడా అరెస్టు చేసే అధికారం ఉంది. కానీ, తాజాగా ఈ విధానాన్ని ర‌ద్దు చేశారు. ఇక‌పై వ్యాపారుల‌కు.. కేవలం నోటీసులు ఇచ్చేందుకు మాత్ర‌మే అధికారులు ప‌రిమితం అవుతారు. న్యాయ‌స్థానాలే శిక్ష‌లు విధింపు, అరెస్టు ఆదేశాలు చేయ‌నున్నాయి.
  2. 5 కోట్ల వ‌ర‌కు పెంపు: జీఎస్టీ చెల్లింపులో ఆల‌స్య‌మైతే.. ఇప్ప‌టి వ‌ర‌కు అప‌రాధ రుసుము వ‌సూలు చేసేవారు. ఇది కోటి రూపాయ‌ల వ‌ర‌కు ప‌రిమితంగా ఉండేది. అంటే.. కోటి రూపాల‌య వ‌ర‌కు ఎవ‌రైనా ఎగ్గొట్టినా.. ఆల‌స్యం చేసినా వెంట‌నే అప‌రాధ రుసుము(జ‌రిమానా) విధించేవారు. కానీ, తాజా నిర్ణ‌యంలో ఈ ప‌రిమితిని 5 కోట్ల రూపాయ ల వ‌ర‌కు పెంచారు.
  3. జ‌రిమానా కోత‌: వ్యాపారులు జీఎస్టీని ఎగ్గొట్టి ఉంటే.. వారికి జ‌రిమానా విధించేందుకు జీఎస్టీ చ‌ట్టం అనుమ‌తి ఇస్తుంది. ప్ర‌స్తుతం ఇది.. 25 వేల రూపాల వ‌ర‌కు ఉంది. అంటే.. ఒక సాధార‌ణ వ్యాపారి జీఎస్టీ ఎగ్గొట్టి ఉంటే.. గ‌రిష్ఠంగా 25 వేల రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంది. ఇప్పుడు దీనిని గ‌రిష్ఠంగా 10 వేల‌కు కుదించారు. అంతేకాదు, జీఎస్టీ వసూలు, వడ్డీ, నిబంధనలకు అనుగుణంగా మాత్ర‌మే జరిమానా విధించ‌నున్నారు.
  4. చిరు వ్యాపారుల‌కు ఊర‌ట‌: ఆన్‌లైన్ ద్వారా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి తాజాగా జీఎస్టీ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. అలాగే.. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో ఉన్న ప్ర‌త్యేక నిబంధ‌న‌లు, ప‌త్రాల స‌మర్ప‌ణ వంటి కీల‌క అంశాల‌ను కూడా త‌ప్పించారు. త‌ద్వారా దేశంలో సొంత‌గా ఉపాధి మార్గాలు వెతుక్కునే వారికి ఇది ఊర‌టనివ్వనుంది.

This post was last modified on October 9, 2026 7:03 am

Share

Recent Posts

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

33 minutes ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

3 hours ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

7 hours ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

8 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

9 hours ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

9 hours ago