ఎప్పుడైతే ఫౌజీ డిసెంబర్ 4 వదిలేసుకుందో అప్పటి నుంచి దాని మీద పోటీ పెరిగి ఇప్పుడు ఏకంగా అరడజను సినిమాలు నువ్వా నేనాని తలపడే దాకా వచ్చింది. ఒకప్పుడు ఈ నెలని కొంచెం డ్రై మంత్ గా భావించేవాళ్లు. ఎప్పుడైతే పుష్ప 2, యానిమల్, దురంధర్ వచ్చి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయో సంక్రాంతికి మించిన గ్యారెంటీ నిర్మాతలకు ఇందులో కనిపించింది. అందుకే ఎగబడి మరీ కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. అయితే ఈసారి కాంపిటీషన్ వెరైటీగా డిఫరెంట్ గా ఉండబోతోంది.
నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా రూపొందిన ఫాంటసీ డ్రామా ‘వృషకర్మ’ మీద ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే. ట్రైలర్ వచ్చాక అనూహ్యంగా హైప్ పెరుగుతుందని దర్శకుడు కార్తీక్ దండు, నిర్మాత ప్రసాద్ ధీమాగా ఉన్నారు. నాని నిర్మించిన ‘అలియాస్ రుక్మిణి’కి అప్పుడే ప్రమోషన్లు మొదలుపెట్టారు. నా కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని హీరో నితిన్ స్టేట్ మెంట్ ఇవ్వడం ఫ్యాన్స్ లో బజ్ పెంచింది. విశ్వక్ సేన్ లెగసి కూడా వచ్చేది కానీ ఈ నగరానికి ఏమైంది రిపీట్ కోసం దాన్ని వాయిదా వేశారు.
ఇక్కడితో అయిపోలేదు. శ్రద్ధ కపూర్ టైటిల్ రోల్ పోషించిన ‘ఈద’ మీద మూవీ లవర్స్ లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రియల్ లైఫ్ బయోపిక్ అయినప్పటికీ కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా రూపొందింది. సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ మీద భారీ ఆశలేం లేవు కానీ పబ్లిసిటీ అయితే ఘనంగా చేస్తున్నారు. కండల వీరుడు ఏమైనా సర్ప్రైజ్ ఇస్తాడేమో చూడాలి. విజయ్ సేతుపతి హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ మూవీ ‘ట్రైన్’ డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
హాలీవుడ్ క్రేజీ మూవీ ‘డ్యూన్ పార్ట్ 1 అండ్ 2’ వారం రోజుల లిమిటెడ్ థియేటర్ రన్ కోసం ప్రత్యేకంగా రీ రిలీజ్ చేస్తున్నారు. మూడో వారంలో వచ్చే కొత్త భాగం కోసం ముందస్తు ప్రిపరేషన్ అన్నమాట. మమ్ముట్టి మరో సినిమా ‘పాదయాత్ర’ని సమాంతరంగా దక్షిణాది భాషల్లో విడుదల చేసే ప్లాన్ లో నిర్మాతలున్నారు. తెలుగు వరకు చూసుకుంటే ఇక్కడ చెప్పిన వాటిలో ఎన్ని వచ్చినా ప్రధానమైన క్లాష్ మటుకు వృషకర్మ, అలియాస్ రుక్మిణి మీదే ఉంటుంది. రెండూ బాగుంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది.
This post was last modified on November 21, 2026 2:18 pm
మొన్న విడుదలైన అన్ని సినిమాల్లో ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది ఆకాశంలో ఒక తారకే. దుల్కర్ సల్మాన్ హీరోగా సాత్విక…
ఏపీ మండలాధ్యక్ష ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం.. కనబరిచింది. 2024లో వచ్చిన స్ట్రయిక్ రేట్‌ను ఇప్పుడు కూడా కొనసాగించింది. ఏపీలోని మొత్తం…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు.. టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.…
కల్వకుంట్ల కవిత...ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చే మరో పేరు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ సాధనలో…
మూడేళ్ళ క్రితం మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సంక్రాంతి రేసులో తలపడి తేజ సజ్జ అంత…
కొన్ని రోజుల ముందు ‘అక్క’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక చిట్ చాట్‌లో.. రాధిక ఆప్టే తెలుగు…