Political News

బీసీల విషయంలో వైసీపీ జాగ్రత్త పడుతుందా?

లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో బీసీల‌కు 34 శాతం మేర‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని కూట‌మి స‌ర్కారు నిర్ణ‌యించింది. దీనిపై స‌భ‌లో చ‌ర్చించి నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. జీవోలు కూడా విడుద‌ల చేశారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం కోర్టుకు వెళ్ల‌డం.. రిజ‌ర్వేష‌న్ల‌ను 50 శాతానికి మించ‌రాద‌ని కోర్టు చెప్ప‌డం తెలిసిందే. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకో ర్టులో పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఈ వ్య‌వ‌హారం ఉంది. అయితే.. దీనిపై రాజ‌కీయంగా కూడా పెద్ద ఎత్తున ఉద్య‌మించాల‌ని అధికార పార్టీ నిర్ణ‌యించింది.

వైసీపీ కార‌ణంగానే బీసీల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని.. వారికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డాన్ని వైసీపీ నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నార‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. బీసీల‌కు వైసీపీ వెన్నుపోటు పొడుస్తొంద‌ని సీఎం చంద్రబాబు కూడా ప‌లు సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప్రారంభించ‌నున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వ‌చ్చినా.. వ్య‌తిరేకంగా వ‌చ్చినా.. ఈవిష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు.

ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు వ్య‌తిరేకంగా వ‌స్తే.. వైసీపీ కార‌ణంగానే బీసీల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌న్న వాద‌నను వినిపించాల‌ని, ప్ర‌జ‌ల్లో బీసీల రిజ‌ర్వేష‌న్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. కాగా.. ఇంత‌లోనే వైసీపీ అలెర్ట్ అయింది. టీడీపీ కంటే కూడా ముందుగానే తాము ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఈ నెల 16న విశాఖ‌లో బీసీ గ‌ర్జ‌న పేరుతో వైసీపీ భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేసింది. ఈ స‌భ ద్వారా.. వైసీపీ హ‌యాంలో బీసీల‌కు జ‌రిగిన మేలును వివ‌రించ‌నున్నారు.

అదేస‌మ‌యంలో బీసీల‌కు సంబంధించి చేసిన రిజ‌ర్వేష‌న్ జీవోల‌పైనా వైసీపీ త‌న వాయిస్ వినిపించ‌నుంది. అయితే.. ఈ స‌భ‌లో కూడా య‌ధావిధంగా జ‌గ‌న్ హాజ‌రుకావ‌డం లేద‌ని వైసీపీ ప్ర‌క‌టించింది.కేవ‌లం ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన నాయ‌కులు మాత్ర‌మే ఈ స‌భ‌కు హాజ‌రుకానున్నారు. మొత్తంగా టీడీపీ కంటే ముందే.. వైసీపీ అలెర్టు కావ‌డం.. బీసీల విష‌యంలో త‌మ వాయిస్ వినిపించేందుకు ప్లాన్ చేసుకోవ‌డం వంటివి ఆస‌క్తిగా మారాయి.

This post was last modified on October 10, 2026 8:42 am

Share

Recent Posts

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

23 minutes ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

2 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

2 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

6 hours ago

గొప్ప నిర్ణ‌యం: ఏపీలోనే విదేశీ విద్య‌!

ప్ర‌స్తుతం విదేశీ విద్య‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ స‌హా దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్‌, ర‌ష్యా స‌హా..…

9 hours ago

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

10 hours ago