కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన వాతావరణమే ఉందని తాజాగా వెల్లడించిన చాణిక్య స్ట్రాటజీ సర్వే తెలిపింది. ఇందులోనూ టిడిపి భారీగా పుంచుకుందని పేర్కొంది. ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన వాతావరణం ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి కూటమి సారధిగా ఉన్న చంద్రబాబు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని చెబుతున్నట్టుగా అయితే క్షేత్రస్థాయిలో ప్రజల నాడి ఆ విధంగా పూర్తిస్థాయి అనుకూలంగా లేదన్నది మాత్రం ఈ సర్వే స్పష్టం చేస్తుంది.
మొత్తం 50 వేల మందిని అన్ని కోణాల్లోనూ పరిశీలించి చాణిక్య స్ట్రాటజీ సంస్థ ఈ సర్వే చేసింది. దీనిలో నగరాలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలను పలకరించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీరిలో సాధారణ ప్రజలతో పాటు పథకాలు అందుకుంటున్న వారు.. వివిధ రూపాల్లో లబ్ధి పొందుతున్న వారు కూడా ఉన్నట్టు సర్వే సంస్థ విసదీకరించింది. మొత్తంగా ఆయా వర్గాలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో అయితే లేవన్నది సర్వే చెబుతున్న ప్రధాన విషయం.
50,000 మందిలో టిడిపి వైపు కేవలం 24,622 మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సగం మంది కూడా లేరనే అనుకోవాలి. మొత్తంగా ఓటు బ్యాంకు విషయంలో 46.9% టిడిపికి అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. దీంతో ఆశించిన స్థాయిలో అయితే అనుకూలంగా ఓటు బ్యాంకు లేదన్నది తెలుస్తోంది. అంతేకాదు గత కొన్నాళ్లుగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తోంది. ఉపాధి కల్పన.. ఉద్యోగ కల్పనకు కూడా ప్రాధాన్యమిస్తుంది. అయినప్పటికీ 50% చేరుకోవడంలో ఎక్కడో తడబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే కాన్సెప్ట్ను తీసుకొని చాణక్య స్ట్రాటజీ చేసిన ఈ సర్వే ప్రభుత్వానికి ఒక రకంగా తనను తాను సమీక్షించుకునేందుకు అలాగే పథకాలు ఇతర అంశాలపై పునఃశ్చరణ చేసుకునేందుకు కూడా ఒక గొప్ప అవకాశం గానే భావించాలి.
నిజానికి ఇలాంటి సర్వేలను ప్రామాణికంగా తీసుకోవాలా వద్దా అనే అంశాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. అయినప్పటికీ జరుగుతున్న పరిణామాలను, అన్ని కోణాల్లోనూ అంచనా వేసే చాణక్య వంటి సంస్థలను అందిపుచ్చుకుని వారి ఇచ్చిన సమాచారం లేదా వారు చెబుతున్న అంకెలను తెలుసుకుని దాని ప్రకారం భవిష్యత్తు వ్యూహాలను అమలు చేస్తే ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే టిడిపికి వైసిపి కి మధ్య ఉన్న తేడా కేవలం 11% మాత్రమే. కాబట్టి దీన్ని మరింతగా పెంచుకునేలా టిడిపి కూటమి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇది భవిష్యత్తుకు ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి కూటమికి ఎంతగానో ఉపయోగపడనుంది అనడంలో సందేహం లేదు.
This post was last modified on October 8, 2026 7:08 am
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…