మన దేశంలో ఒక కొత్త పార్టీ పెట్టగానే ఆ పార్టీలో చేరేవారిలో కొత్తవారికంటే పక్క పార్టీల నుంచి వలస వచ్చిన నేతలే ఎక్కువగా ఉంటారు. వైసీపీలో గతంలో పనిచేసిన, ప్రస్తుతం చేస్తున్న చాలామంది నేతలు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులే. అయితే, వైసీపీ స్థాపించిన వెంటనే ఏపీ కాంగ్రెస్ నేతలంతా పొలోమని వైసీపీలోకి క్యూ కట్టారు. టెక్నికల్ గా చూస్తే ఏపీలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడానికి కారణం వైసీపీనే.
కట్ చేస్తే…అదే వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు వెన్నుదన్నుగా ఉన్న విజయసాయిరెడ్డి అదే ఫార్ములాను వైసీపీపై ప్రయోగిస్తున్నారు. తన కొత్త పార్టీ పీఆర్పీ పెట్టిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా వైసీపీ నేతలకు గేట్లు బార్లా తెరిచారు. కుటుంబాలను పక్కనబెట్టి చెమటోడ్చి వైసీపీని బలోపేతం చేసిన నేతల్లో తాను కూడా ఒకడినని ఆయన అన్నారు. కష్టపడతాం, గౌరవం కావాలి ,నాయకత్వంలో భాగస్వామ్యం కావాలి, ప్రజా సేవ చేయాలి అనుకునే వైసీపీ నేతలకు పీఆర్పీ తలుపులు ఎల్లపుడూ తెరిచే ఉంటాయని సాయిరెడ్డి చెప్పారు.
2019లో వైసీపీ 151 స్థానాలతో అద్భుతమైన విజయం అందుకుందని, అదే ప్రజలు 2024లో వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశారని సాయిరెడ్డి గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలు స్వాగతించారని, పేదలకు అందిన సాయాన్ని తిరస్కరించలేదని చెప్పారు. అయితే, వైసీపీ నేతల అహంకారాన్ని, అహంభావాన్ని, ప్రజలకు దూరం అయిన వైసీపీ నాయకత్వాన్ని జనం తిరస్కరించారని అన్నారు.
ప్రశ్నించే గుణాన్ని సహించని వైసీపీ రాజకీయ సంస్కతిని తిరస్కరించారని తెలిపారు. ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు వినాలని, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే, నాయకుల చుట్టూ గోడలు కడితే.. గోడ కట్టుకొని ప్రజలకు నాయకుడికి మధ్య దూరం పెరిగితే వైసీపీకి వచ్చిన ఫలితాలే ఏ పార్టీకైనా వస్తాయని జోస్యం చెప్పారు. పరోక్షంగా జగన్ చుట్టూ సజ్జల కోటరీని సాయిరెడ్డి ఎండగట్టారు.
This post was last modified on November 12, 2026 12:52 am
రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటామని పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్‌పీ) అధ్యక్షుడు వి. విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తున్న బిలాంగింగ్…
ఇరుముడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన…
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో కుటుంబ…
రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం…
రామాయణం సినిమా రిలీజ్ ముంగిట ఎటు చూసినా నెగెటివ్ వార్తలే కనిపించేవి. రూ.4 వేల కోట్ల బడ్జెట్ సహా ఆ…