కొన్ని నెలల ముందు ‘పెద్ది’ సినిమాతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు బుచ్చిబాబు సానా. ఐతే ఆ సినిమా అంతిమంగా ఆశించిన ఫలితాన్నివ్వలేకపోయింది. దీంతో కొన్ని రోజులు బుచ్చిబాబు మీడియా ఫోకస్‌కు దూరంగా ఉన్నాడు. కానీ ఈ మధ్య బుచ్చిబాబు మళ్లీ మీడియాలో బాగా హైలైట్ అవుతున్నాడు. అందుక్కారణం.. తరచుగా సినిమా ఈవెంట్లలో కనిపిస్తుండడమే. ఓవైపు ఓపెనింగ్స్, ఇంకోవైపు ప్రి రిలీజ్ ఈవెంట్లలో బుచ్చిబాబు సందడి చేస్తున్నాడు.
ముఖ్యంగా తనకు హోం బేనర్ అనదగ్గ మైత్రి మూవీ మేకర్స్‌కు సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా.. బుచ్చిబాబు ఉండాల్సిందే. మొన్న రామ్ చరణ్, సుకుమార్ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న బుచ్చిబాబు.. నిన్న ‘దొంగ నా కొడుకు’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తళుక్కుమన్నాడు. ఇలా మైత్రి వారి ప్రతి ఈవెంట్లో పాల్గొనడం గురించి బుచ్చిబాబు భలే సరదా కామెంట్ చేశాడు.
మైత్రి అధినేత రవిశంకర్.. ఈ సంస్థకు సంబంధించిన ప్రతి ఈవెంట్‌కూ పిలుస్తారని.. ఆయన పిలిస్తే రాకుండా ఉండలేమని.. ఇలా పిలిచే ఒక్కో ఈవెంట్‌కు రూ.10 వేల చొప్పున ఇచ్చినా, ఈపాటికి కోకాపేటలో ఒక ఫ్లాట్ కొనేసేవాడినని బుచ్చిబాబు వ్యాఖ్యానించడం విశేషం. ఈ కామెంట్‌తో ఆడిటోరియం నవ్వుల్లో మునిగిపోయింది. రవిశంకర్ సైతం గట్టిగా నవ్వారు.
బుచ్చిబాబు ప్రస్తుతం తన కొత్త చిత్రానికి కథ తయారు చేసుకునే పనిలో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి సహా కొందరు పెద్ద హీరోల మీద బుచ్చిబాబు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా అతను పెద్ద బడ్జెట్ సినిమానే చేసే అవకాశముంది. ‘పెద్ది’ కొంచెం అటు ఇటు అయినప్పటికీ.. మైత్రి అధినేతలకు బుచ్చిబాబు మీద నమ్మకం ఏమీ సడలిపోలేదు. చరణ్, సుకుమార్ సినిమా ఈవెంట్‌కు వచ్చినపుడు కూడా రవిశంకర్ మాట్లాడుతూ.. ఈసారి బుచ్చిబాబు గట్టిగా బౌన్స్ బ్యాక్ అవుతాడని ధీమాగా చెప్పారు.
This post was last modified on November 12, 2026 12:05 pm
ఏఐ చిప్స్‌తో ప్రపంచ టెక్నాలజీని షేక్ చేస్తున్న ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఇప్పుడు తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లోకి…
రేపు డీఎన్‌కే విడుదల కానుంది. మైత్రి నిర్మాణం కావడంతో రిలీజ్ పరంగా మంచి స్క్రీన్ కౌంట్ దక్కనుంది. రామాయణ పార్ట్…
సాధారణంగా భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాలు కుటుంబాలకే పరిమితమవుతుంటాయి. కానీ కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన ఓ వైవాహిక వివాదం మాత్రం…
ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంత కరువు పరిస్థితిలో కూడా 700 కిలోమీటర్లు నీరు పారించారని, వెలుగొండ, పోలవరం ప్రాజెక్టులు ప్రారంభించి…
ఇరుముడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన…
ఉద్యోగుల పని పరిస్థితులు, వారి ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హోటళ్లు,…