ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంత కరువు పరిస్థితిలో కూడా 700 కిలోమీటర్లు నీరు పారించారని, వెలుగొండ, పోలవరం ప్రాజెక్టులు ప్రారంభించి వాటర్ మెన్ గా గుర్తింపు పొందారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒట్టి మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎండబెడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రాకు నీరు, తెలంగాణాకు ఎక్కిళ్ళు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదిప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారి తీసింది. నిర్మల్‌లో జరిగిన బీఆర్ఎస్ రైతు గర్జన సభలో కేటీఆర్ మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన ఆయన తెలంగాణా సీఎం అసమర్ధత వల్లనే రాష్ట్రంలో కరువు పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని మరోసారి దుయ్యబట్టారు.లేకపోతే గోదావరి పారే ఈ ప్రాంతంలో కరువు ప్రకటన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. తమ హయాంలో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ వంటి ప్రాజెక్ట్‌లను పూర్తిచేశామని, కేసీఆర్ ఉంటే నీళ్ల జాతర ఉండేదనిచెప్పారు. నీటి పన్ను కూడా రద్దు చేసిన ఘనత కేసీఆర్ మాత్రమే దక్కుతుందన్నారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి నీరు లేక వందలాది హాస్టాల్స్ మూత వేయడం గతంలో ఎప్పుడూ జరగలేదని, తాగునీరు, సాగు నీరు ఇవ్వమని ప్రజలు అడుగుతుంటే కేటీఆర్ గడ్డం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఒకరి మీద మరొకరు చేసుకుంటున్న ఆరోపణలతో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. కొడంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. కేటీఆర్ కొత్త గెటప్ మీద ఓ ఆట ఆడుకున్నారు. గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి కాలేవని సీఎం చేసిన విమర్శలు సోషల్ మీడియాను ఊపేసింది. నిర్మల్ సభలో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాది తెలంగాణాలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పర్యటనకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత కొడంగల్ నుంచి ప్రజా బలం పేరుతో యాత్ర చేపట్టానున్నారు. బీఆర్ఎస్ కూడా ప్రజల వద్దకు వెళ్లి తాడో పేడో తేల్చుకునేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటుంది. మొత్తం మీద తెలంగాణాలో ఏడాది ముందే ఎన్నికల వాతావరణం కనిపిస్తుందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on November 12, 2026 9:29 am
ఇరుముడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన…
ఉద్యోగుల పని పరిస్థితులు, వారి ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హోటళ్లు,…
రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటామని పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్‌పీ) అధ్యక్షుడు వి. విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తున్న బిలాంగింగ్…
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో కుటుంబ…
రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం…