Political News

ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు ఇక అధికారికం..!

సోష‌ల్ మీడియాలైన ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టా గ్రామ్ వంటి వాటిలో వీడియోలు, రీల్స్ చేసి.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌ను అధికారికంగా నియ‌మించుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. వీరు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, సామాజిక సంక్షేమ కార్య‌క్ర‌మాలు, పెట్టుబ‌డులు, త‌ద్వారా వ‌స్తున్న ఉద్యోగాలు, ఉపాధి క‌ల్ప‌న వంటి అంశాల‌పై ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌దునైన వ్యాఖ్య‌లు.. సూటిగా అర్థ‌మ‌య్యే భాష‌లో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సి ఉంటుంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే చాలా మంది ఇన్ ఫ్లుయెన్స‌ర్లు ఉన్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వారంతా అన‌ధికారికంగా ఉంటున్నారు. ఇక నుంచి వీరిని అధికారికంగా గుర్తిస్తారు.

ఏం చేస్తారు?

తాజాగా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. వారిని అధికారికంగా నియ‌మించాల‌ని ప‌లువురు మంత్రులు సూచించారు. ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి చేర‌వేసేందుకు బ‌ల‌మైన సాధ‌నంగా ఉన్న సోష‌ల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్స‌ర్ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో వారిని అధికారికంగా గుర్తిస్తూ.. వేత‌నాలు ఇవ్వాల‌ని సూచించారు. దీనికి సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం .. ఓకే చెప్పారు. దీంతో వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి కొంద‌రిని ఎంపిక చేసి అధికారికంగా నియ‌మించ‌నున్నారు.

ఎందుకు?

ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని సీఎం చంద్ర‌బాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప‌దే ప‌దే చెబుతున్నారు. వారు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నారు. అయితే.. సోష‌ల్ మీడియా బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో ఇన్ ఫ్లుయెన్స‌ర్ల ప్ర‌భావం కూడా ఎక్కువ‌గా ఉంద‌న్న వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో వారి ద్వారా కూడా ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. దీంతో ప్ర‌భుత్వం తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఎలా ఎంపిక చేస్తారు..

ప్ర‌స్తుతం ఉన్న ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌ను.. వారికి ఉన్న ఫాలోవ‌ర్లు, స‌బ్ స్క్రైబ‌ర్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. స‌బ్ స్క్ర‌బర్ల సంఖ్య ఆధారంగానే వారికి వేత‌నాలు కూడా చెల్లించ‌నున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. ఇక ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌కు.. ల‌క్ష మంది కంటే ఎక్కువ‌మంది స‌బ్ స్క్రైబ‌ర్ లేదా ఫాలోవ‌ర్లు ఉంటే.. వారికి 15 వేల రూపాయ‌ల వేతనం ఇస్తారు. అలానే..50 వేల మంది స‌బ్ స్క్రైబ‌ర్ లేదా ఫాలోవ‌ర్లు ఉంటే.. వారికి 7500 రూపాయ‌లు, 25 వేల మంది స‌బ్ స్క్రైబ‌ర్ లేదా ఫాలోవ‌ర్లు ఉంటే.. వారికి 5 వేల రూపాయ‌లు, 10 వేల మందికి త‌క్కువ‌గాకుండా స‌బ్ స్క్రైబ‌ర్ లేదా ఫాలోవ‌ర్లు ఉంటే.. వారికి 2500 చొప్పున నెల నెలా చెల్లిస్తారు. వారు చేసే రీల్స్‌, వీడియోల‌ను ఆర్టీజీఎస్ ద్వారా స‌మీక్షించ‌నున్నారు.

This post was last modified on September 24, 2026 12:52 pm

Share

Recent Posts

ముత్తువేల్ పాండియన్ మళ్ళీ మొదలెట్టాడా

ఇవాళ జైలర్ 2 భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. మాములుగా బ్లాక్ బస్టర్ సీక్వెల్ కుండే హైప్ దీనికి పూర్తి…

47 minutes ago

అయిదు సినిమాలు… ఎక్కడ చిరునామాలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని పూర్తి చేయడం ఒక యజ్ఞం అనుకుంటే దాన్ని థియేటర్ల దాకా తీసుకురావడం ఇంకో మహా సంకల్పంగా…

4 hours ago

ఎల్ నినో కూడా కరోనా లాంటి విపత్తే

దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రత మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశం మీద అందులోనూ దక్షిణ…

4 hours ago

ఆఫీస్ ఓపెన్ చేయడానికి రెండేళ్లా?

టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అంత గొప్ప పేరున్న దర్శకుడు సుకుమార్. రాజమౌళిలా భారీ ఈవెంట్ ఫిలిమ్స్ తీయకపోయినా.. తన మార్కు…

5 hours ago

జబర్దస్త్ కమెడియన్… టాక్ ఆఫ్ ద టౌన్

జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చూసి అందరూ నవ్వుకుంటారు కానీ.. అందులో కనిపించే వారి మీద ఒక రకమైన చిన్న…

5 hours ago

టైసన్ నాయుడు ఏమయ్యాడని అడిగితే…

సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్ ఒకప్పుడు తరచుగా సినిమాలతో పలకరించేవాడు. భారీ బడ్జెట్లలో, పెద్ద కాంబినేషన్లలో…

7 hours ago