Political News

కేంద్ర కేబినెట్లోకి డీఎంకే…?

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నానుడి. దీన్ని డీఎంకే, బీజేపీ నిజం చేస్తున్నట్లు కనిపిస్తుంది. తమిళనాడులో నిన్నా మొన్నటి వరకు ఉప్పు నిప్పు లా వ్యవహరించిన డీఎంకే, బీజేపీ మధ్య ఫ్రెండ్షిప్ కుదిరినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో డీఎంకే కూడా చేరనున్నట్లు హస్తినలో ప్రచారం జరుగుతుంది.

నాలుగు నెలల క్రితం తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలు కావడం తెలిసిందే. గత పదేళ్లుగా డీఎంకే కూటమిలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత టీవీకేకు మద్దతు పలకడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. బీజేపీ ని అధికారంలోకి రాకుండా అడ్డుకునే క్రమంలో మిగిలిన మిత్రపక్షాలు కూడా టీవీకేతో వెళ్ళిపోయాయి. దీంతో ప్రతిపక్షంలో వున్న డీఎంకే ఒంటరియ్యింది. కానీ డీఎంకే కు 37 మంది ఎంపీలున్నారు. దాంతో ఎలాగైనా సరే డీఎంకే ని తనదారిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంది. చివరికి ఇరు పార్టీల మధ్య స్నేహం చిగురించినట్లు ప్రచారం జరుగుతుంది.

ఇటీవల డీఎంకే ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత
కనిమొళి న్యూ ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ను కలవడం మారుతున్న రాజకీయ పరిణామాలకు సంకేతంగా చెప్పుకుంటున్నారు. ఎన్డీఏను మరింతగా బలోపేతం చేసుకోవడం, దక్షిణాదిన పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ మంత్రివర్గ విస్తరణకు ముందే డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్ ) పార్టీలను చేర్చుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబందించిన చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది.

నీట్ పేపర్ లీకేజికి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు జంతర్ మంతర్ విద్యార్థులు నిర్వహించిన పోరాటంతో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే. కేంద్ర కేబినేట్లో మరికొన్ని శాఖలు కూడా ఖాళీగా వున్నాయి. మంత్రుల పనితీరు ఆధారంగా సగం మంది మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మోదీ అలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రతిష్టాత్మక బ్రిక్స్ సమావేశాలు కూడా ముగిశాయి. ఈనెల మూడో వారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న యోచనలో మోదీ వున్నారు. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేయడం ఖాయమని చెబుతున్నారు.

డీఎంకేకు 37 మంది సభ్యులు ఉండటంతో కీలకమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. డీఎంకే పార్లమెంటరీ నాయకురాలు కనిమొళి, తిరుచ్చి శివలకు మంత్రి పదవులు ఖరారైనట్లు ఢిల్లీ సర్కిల్ లో వినిపిస్తుంది. ఇటీవల తమిళనాడులో ప్రత్యర్థి పార్టీలు తిరుచ్చి శివ త్వరలో కేంద్రమంత్రి కాబోతున్నారని విమర్శలు చేయడం గమనార్హం.

ఏది ఏమైనా డీఎంకే ద్రవిడ సిద్ధాంతం, బీజేపీ సనాతన సిద్ధాంతం కలగలిసి పోవడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాషాయ శ్రేణులు ఇరకాటంలో పడ్డాయి. నిన్నటిదాకా డీఎంకే అధినేత కుమారుడు, నాటి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మారన్ పేరు వింటేనే బీజేపీ శ్రేణులు మండిపడేవి. ఉదయనిది సైతం సనాతన ధర్మం మీద నిప్పులు కురిపించేవాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ చేతులు కలిపితే క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఫీలింగ్ ఏమిటన్న దానిమీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అటు డీఎంకే కానీ ఇటు బీజేపీ కానీ ఈ విషయం గురించి నోరువిప్పి మాట్లాడ్డం లేదు. మున్ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

This post was last modified on September 14, 2026 6:44 pm

Share

Recent Posts

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

13 minutes ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

23 minutes ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

2 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

2 hours ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago