Movie News

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే వాళ్ల‌తోనే ప‌ని చేస్తారు. ముఖ్యంగా సంగీత ద‌ర్శ‌కుల విష‌యంలో ఇంకో ఆప్ష‌న్ ఆలోచించ‌కుండా ఒక్క‌రితోనే ప‌ని చేస్తూ వ‌చ్చిన ద‌ర్శ‌కులు టాలీవుడ్లో ఇద్ద‌రున్నారు. ఒక‌రు రాజ‌మౌళి అయితే.. ఇంకొరు సుకుమార్. జ‌క్క‌న్న మొద‌ట్నుంచి కీర‌వాణితోనే ప్ర‌యాణం సాగిస్తుంటే.. సుక్కు ఏమో దేవిశ్రీ ప్ర‌సాద్‌ను వ‌దిలిపెట్ట‌లేదు. వీళ్లిద్ద‌రూ సినిమాలు తీసినంత కాలం ఆ ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కుల‌తోనే సాగిపోతార‌ని అంతా అనుకున్నారు.

జ‌క్క‌న్న అయితే అదే క‌మిట్మెంట్‌తో ఉన్నాడు కానీ.. సుకుమార్ మాత్రం దేవిని వ‌దిలేస్తున్న‌ట్లుగా గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆల్రెడీ పుష్ప‌-2 చిత్రానికి కొంత‌మేర బీజీఎం సామ్ సీఎస్‌తో చేయించుకోవ‌డం ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు రేపిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడేమో రామ్ చ‌రణ్‌తో తాను చేయ‌బోయే కొత్త చిత్రానికి దేవి బ‌దులు దురంధ‌ర్ ఫేమ్ శ‌శ్వత్ స‌చ్‌దేవ్‌తో ప‌ని చేయ‌బోతున్న‌ట్లు కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఐతే దేవి ఫ్యాన్స్ ఈ విష‌యాన్ని అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. గ‌త కొన్ని రోజులుగా వాళ్లు సుకుమార్ మీద గ‌ట్టిగానే యుద్ధం చేస్తున్నారు. మొద‌ట్నుంచి దేవితోనే మ్యూజిక్ చేయించుకుంటున్న సుకుమార్ అంటే త‌మ‌కెంతో అభిమానం, గౌర‌వం అని చెబుతూనే.. దేవిని ప‌క్క‌న పెట్ట‌డం అన్యాయ‌మంటూ మండిప‌డుతున్నారు. సుక్కు సినిమాల‌కు దేవి ఎంత గొప్ప మ్యూజిక్ ఇచ్చాడో.. ఆయ‌న అందుకున్న విజ‌యాల్లో త‌న పాత్ర ఎంత కీల‌క‌మో.. ఆయ‌న కెరీర్లో ఫ్లాప్ అయిన జ‌గ‌డం, ఆర్య‌-2, 1 నేనొక్క‌డినే సినిమాల‌కు కూడా ఎంత మంచి పాట‌లు, బీజీఎం అందించాడో గుర్తు చేస్తూ.. సుక్కు మీద ఎటాక్ చేస్తున్నారు.

దేవి య‌ల్ల‌మ్మ‌తో హీరో కావ‌డంతో ఆ ప్రాజెక్టులో బిజీగా ఉండ‌డం వ‌ల్లే సుకుమార్ వేరే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను ఎంచుకున్నార‌నే వాద‌న‌ను వాళ్లు న‌మ్మ‌ట్లేదు. దేవి హీరో అయ్యాక కింగ్ 100 స‌హా వేరే ప్రాజెక్టుల‌కు ప‌ని చేస్తుండడాన్ని ఉద‌హ‌రిస్తూ ఇది అస‌లు కార‌ణ‌మే కాదంటున్నారు. ఒక సినిమాకు వేరే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో ప‌ని చేశాక దేవితో ఉన్న కంఫ‌ర్ట్ ఏంటో.. సుక్కు సినిమాల‌కు అత‌నెంత బ‌లం అవుతాడో అర్థ‌మ‌వుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రేమో దేవిని వ‌ద‌లొద్దంటూ సుక్కుకు వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు.

This post was last modified on September 13, 2026 11:04 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

18 minutes ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

32 minutes ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

60 minutes ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

1 hour ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

2 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

2 hours ago