అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. లడఖ్‌లోని టుర్‌టుక్‌ నుంచి న్యుబ్రా వెళ్తున్న యూట్యూబర్‌ సుధీర్‌ కుమార్‌కు ఎదరుపై ఆసక్తికర అనుభవం ఇది. మొహర్రం సందర్భంగా మార్గంలో ప్రయాణికులకు కొందరు ఉచితంగా షర్బత్‌ అందిస్తున్నారు. అక్కడ ఓ చిన్నారి సుధీర్‌కు షర్బత్‌ అందిస్తూ డబ్బులు తీసుకునేందుకు నిరాకరించాడు.

మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని ఓ చిన్నారి యూట్యూబర్ను అడిగినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ సందర్భంగా సుధీర్‌ తనది ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పడంతో.. పక్కనే ఉన్న చిన్నారి ఒక్కసారిగా ‘అమరావతినా?’ అని అడగడం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసింది. లడఖ్‌ వంటి సుదూర ప్రాంతంలో ఓ చిన్నారి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పేరు ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.

సామాజిక మాధ్యమాల విస్తరణతో దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సమాచార మార్పిడి ఎంతగా పెరిగిందో ఈ ఘటన చాటి చెబుతోందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఆత్మీయత, అతిథి మర్యాదలు మనుషులను దగ్గర చేస్తాయని పేర్కొంటున్నారు. సుధీర్‌ కుమార్‌ ఎదుర్కొన్న ఈ అనుభవానికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇదే సమయంలో వైసీపీ మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదనను తీసుకురావడం కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తోంది. దేశానికి ఒక చివర గడ్డకట్టే చలితో ఉండే లడఖ్‌.. మరో చివర వేడి, తేమతో కూడిన ఆంధ్రప్రదేశ్‌. భౌగోళికంగానే కాకుండా సంస్కృతీ సంప్రదాయాల్లోనూ ఈ రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. అయితే మనుషులను, మనసులను కలిపేది ప్రాంతాలు, భాషలు కాదని.. ఆత్మీయత, అమాయకత్వమేనని లడఖ్‌లో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన చాటిచెప్పింది. అయితే ఈ విషయం వైసీపీకి ఎందుకు అర్ధం కావడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.