నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికి
వెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20 మ్యాచ్ లో ఎంతమంది పారిశ్రామికవేత్తలను కలిశానో చెబితే ఆశ్చర్య పోతారు, వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టారని మంత్రి నారా లోకేష్ చెప్పారు. చిత్తశుద్ది కలిగిన నాయకుడు ఎక్కడ వున్నా, ఏం చేస్తున్నా ప్రజల గురించే ఆలోచిస్తుంటాడన్న దానికి నిదర్శనం లోకేష్. దీనికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి.
కేరళం రాష్ట్రంలోని కొచ్చిలో ఇండియా టుడే కాంక్లేవ్ -2026 జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ మంత్రి లోకేష్ ను ఇంటర్యూ చేశారు. ఈ సందర్బంగా లోకేష్ పలు విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా బాధ్యత కలిగిన పదవిలో వున్న లోకేష్ క్రికెట్ మ్యాచులు చూసేందుకు తరచుగా విదేశాలకు వెళుతున్నాడని వైసీపీ చేస్తున్న విమర్శలకు కేరళం వేదిక మీద నుంచి జవాబు ఇచ్చారు. క్రికెట్ చూడ్డానికి వెళ్లినా, విహార యాత్రలకు వెళ్లినా తన బాధ్యత మరిచిపోయేది లేదని స్పష్టంగా కౌంటర్ ఇచ్చారు.
పెట్టుబడుల గురించే కాకుండా ముఖ్యమంత్రి పదవి గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఆమధ్య త్వరలో లోకేష్ ముఖ్యమంత్రి పదవి చేపట్టానున్నారంటూ మీడియా కోడై కూసింది. ఈ టర్మ్ లోనే బాధ్యతలు చేపడతారని కొందరు, లేదు 2029 ఎన్నికల తర్వాత చేపడతారని మరికొందరు ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకోవడం తెలిసిందే. ఈ విషయం గురించి రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. పదవి కంటే అప్పగించిన పనిని పూర్తి చేయడమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు.
డీఎస్సీలో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ రచ్చ చేస్తున్న సంగతి కూడా ప్రస్తావనకు వచ్చింది. వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తుందని చెప్పిన లోకేష్ ఇప్పటి వరకు ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. డీఎస్సీ లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ కోర్టుకు వెళ్లిందని, సిబిఐ విచారణ కోరుతుందని తెలిపారు. కోర్టు ఇచ్చే ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెప్పారు. అత్యంత వివాదాస్పద సర్ గురించి వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు వివరణ తీసుకుంటున్నామని వివరించారు. కాక్రోచ్ ఉద్యమం గురించి కూడా మాట్లాడారు. మొత్తం మీద లోకేష్ ఇంటర్యూలో ఇచ్చిన సమాధానాలు చాలా మెచ్యూర్ గా ఉన్నాయని మీడియా ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
