Political News

అసెంబ్లీ ఆవరణలో సీపీఆర్ చేసిన మంత్రి కానీ…

వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు…అంటే రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానం అన్న నానుడిని ఇప్పటికీ చాలామంది వైద్యులు పాటిస్తున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో చాలామంది డాక్టర్లు స్థిరపడినప్పటికీ సమయం, సందర్భం వస్తే తమ వైద్యంతో సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తెలంగాణ శాసన సభ సమావేశాల సందర్భంగా ఈ తరహా ఘటన ఒకటి జరిగింది. ఓ పక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న క్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మానవత్వం చాటుకున్నారు.

అసెంబ్లీ ఆవరణలో ఐఏఎస్ అధికారి నవీన్‌ మిట్టల్‌ పీఎస్‌ రాజు అకస్మాత్తుగా కుప్పకూలారు. వెంటనే మంత్రి శ్రీహరి స్పందించి రాజుకు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత రాజుకు మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌ లో ఆసుపత్రికి తరలించారు. అయితే, రాజును కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మార్గమధ్యంలో అంబులెన్సులో రాజు తుది శ్వాస విడిచారు.

అయినప్పటికీ, అసెంబ్లీ ఆవరణలో రాజు పరిస్థితి గమనించి వెంటనే రంగంలోకి దిగిన మంత్రి శ్రీహరి తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో వెంటనే స్పందించి సీపీఆర్‌ చేయడాన్ని అభినందిస్తున్నారు. వైద్యులు ఎక్కడున్నా వైద్యులేనని కొనియాడుతున్నారు. రాజు బ్రతికి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. రాజు కుటుంబానికి పలువురు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on September 8, 2026 4:08 pm

Share

Recent Posts

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

21 minutes ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

27 minutes ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

38 minutes ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

1 hour ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

1 hour ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

6 hours ago