Movie News

మెగా ఫ్యామిలీకి మరో పదవి

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, టాలీవుడ్ నిర్మాత సుస్మిత కొణిదెలను విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమించారు. ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, దసరా శరన్నవరాత్రుల వంటి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణపై సుస్మిత తగిన సూచనలు, సలహాలు అందిస్తారు.

ఈ ప్రకారం ఆమె బోర్డు సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమలో రాణిస్తున్న సుస్మిత కొణిదెలకు ఆలయ పరిపాలన రంగంలో బాధ్యతలు దక్కడం విశేషం.

ఈ క్రమంలోనే 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీకి దక్కిన పదవులపై చర్చ మొదలైంది. జనసేన కీలక నేత నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాత కేబినెట్ హోదా ఉన్న ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌ పదవి దక్కింది.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇక, చిరంజీవికి రకరకాల పదవులు, రాజ్య సభ సభ్యత్వం, ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి వస్తాయని ప్రచారం జరిగినా…అందులో ఏదీ కార్యరూపం దాల్చలేదు.

This post was last modified on September 8, 2026 10:08 pm

Share

Recent Posts

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

57 minutes ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

1 hour ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

1 hour ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

2 hours ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

2 hours ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

6 hours ago