రాజకీయాలకు గుడ్ బై చెప్పానని…వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన రాజ్య సభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి త్వరలోని కొత్త పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మధ్య మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న సాయిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రులు కావాలా అని ఆయన ప్రశ్నించిన వైనం షాకింగ్ గా మారింది. అంతేకాదు, తన పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిని తాను కాదని ఆయన ప్రకటించారు.
తాను జగన్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టడం లేదని, టీడీపీ, వైసీపీ..రెండు పార్టీలు తనకు రాజకీయ ప్రత్యర్థులని, ఆ రెండు పార్టీలు తనకు శత్రువులు కాదని అన్నారు. ఆ మాటకొస్తే సజ్జల కోటరీ కూడా తనకు ప్రత్యర్థులేనని చెప్పారు.
ఏపీలో రప్పారప్పా పార్టీ(వైసీపీ), రెడ్ బుక్ పార్టీ(టీడీపీ)..ఉన్నాయని, ఈ రెండు పార్టీలు ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. తమ కోటరీ మంచిది, తామేమీ చేయలేదు అని తన స్టేట్మెంట్ ను ఖండిస్తే, తనను నమ్మక ద్రోహి అని రెచ్చగొడితే తాను మరిన్ని విషయాలు బయటపెడతానని సజ్జల అండ్ కోటరీకి సాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ఇక, తనను కేఏ పాల్ తో పోల్చిన బొత్స కామెంట్స్ పై కూడా సాయిరెడ్డి స్పందించారు. బొత్స ఎన్ని పార్టీలు మారారు…ఆయన గత చరిత్ర ఏంటి..అది ఎంత దారుణం…విజయమ్మను ఏ రకంగా తిట్టారు…వైఎస్సార్ గరించి బొత్స ఏం మాట్లాడారు అన్నది అందరికీ తెలుసని బొత్సకు చురకలంటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates