ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ అక్టోబర్ 9కి వెళ్ళిపోయిన ఆదర్శ కుటుంబం ఏకే 47 మళ్ళీ కొత్త డేట్ కోసం చూస్తోందనే పుకారు గట్టిగా షికారు చేస్తోంది. టీమ్ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పెండింగ్ ఉండటం వల్ల డెడ్ లైన్ సరిపోదనే ఆలోచనతో నిర్ణయం మార్చుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయని వినికిడి. ప్రస్తుతానికి అఫీషియల్ స్టాంప్ అయితే పడలేదు.
ఒకవేళ మళ్ళీ వాయిదా పడే పక్షంలో అక్టోబర్ 22 ఫ్రెష్ ఆప్షన్ కావొచ్చని తెలుస్తుంది. కానీ అప్పటికంత దసరా సెలవులు అయిపోతాయి. చాలా పెద్ద అడ్వాంటేజ్ మిస్సవుతుంది. నిర్మాతలు నాగవంశీ, రాధాకృష్ణ అలా జరగకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారట. కేవలం మూడు రోజుల క్రితం గుమ్మడికాయ కొట్టిన సంగతి తెలిసిందే. తమన్ రీ రికార్డింగ్ కోసం ఇవ్వాల్సిన కాపీ ఇంకా సిద్ధం కావాల్సి ఉందట. డబ్బింగ్ వగైరా వ్యవహారాలు ఉండనే ఉంటాయి.
వెంకటేష్ వచ్చే వారం లండన్ వెళ్తున్నారని టాక్. ఆలోగా అన్నీ పూర్తి చేసుకోవాలి. సితార వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ప్రకారం ప్రస్తుతానికి అక్టోబర్ 9 డేట్ లో ఎలాంటి మార్పు లేదు. దానికి అనుగుణంగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉంది. ఈ తక్కువ నిడివిలోనే పాటల విడుదల, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్, పబ్లిసిటీ క్యాంపైన్ వగైరాలన్నీ జరిగిపోవాలి. అదే అభిమానులకు టెన్షన్ కలిగిస్తున్నది.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి వెంకటేష్ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో మూవీ లవర్స్ దీని మీద ప్రత్యేక ఆసక్తి పెంచుకున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అంత బజ్ లేదనేది ఫ్యాన్స్ ఫీలవుతున్న మాట వాస్తవం. దూకుడైన ప్రమోషన్లు చాలా అవసరం. సంక్రాంతికి వస్తున్నాం తరహాలో ఏదైనా వెరైటీగా ప్లాన్ చేయాలి. ఎటొచ్చి త్రివిక్రమ్ బృందానికి అంత టైం దొరకడం లేదు. మరి మాట మీద నిలబడి తొమ్మిదికి వస్తుందా లేక గాసిప్ నిజం చేస్తుందా లెట్ వెయిట్ అండ్ సీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates