స్థానిక ఎన్నికలు వాయిదా పడాలని గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని, ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కోర్టులో పెండింగ్లో వున్న సమస్యలను పరిష్కారించుకొని అక్టోబర్ చివరికల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోతాయని, దాంతో రాష్ట్రం ఆర్ధికంగా నష్టపోవాలని గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తుందని విమర్శలు గుప్పించారు. వైసీపీ కుట్రల్ని సాగనిచ్చేది లేదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులతో మంత్రి లోకేష్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహిస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం అమరావతిలో ఆయన మంత్రులతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల వ్యూహం గురించి సుదీర్ఘంగా సహచర మంత్రులతో చర్చించారు. త్వరలో జరగబోయే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలని మంత్రులకు సూచించారు.
విద్యా శాఖను టార్గెట్ చేసుకొని వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీన్ని మిగతా మంత్రులు కూడా సమర్ధవంతంగా తిప్పి కొట్టాలన్నారు. వైద్య రంగానికి సంబందించి ఏ చిన్న సమస్య వచ్చినా రాద్దాంతం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని, ఇలాంటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సూచించారు. ఈ విషయంలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. మాట వినని అధికారులను క్షమించేది లేదని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 9 వ తేది నాటికి చంద్రబాబును అరెస్టు చేసి మూడేళ్లు అవుతుందని గుర్తు చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు వైసీపీ కుట్రలు చేయడం మాసనుకోలేదన్నారు. అప్పటి దుశ్చర్యల నుంచి బయట పడి ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకొని వచ్చారో ప్రజలకు తెలియ చెప్పేలా ఈ ఏడాది సెప్టెంబర్ 9 న ప్రత్యేక కార్యక్రమం చేద్దామని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో చంద్రబాబు స్టామినా అర్ధం అవుతుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates