Political News

అనిల్ యాదవ్ సైలెంటుగా సైడ్ అయిపోతున్నారా?

వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చని, అసలు తన రాజకీయ ప్రస్థానమే ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది.

జగన్‌మోహన్‌ రెడ్డికి వీర విధేయుడిగా పేరున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌.. గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున దూకుడుగా మాట్లాడే నేతగా గుర్తింపు పొందారు. ప్రత్యర్థుల విమర్శలకు ఘాటైన కౌంటర్లతో పార్టీ తరఫున బలమైన వాయిస్‌ వినిపించేవారు. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2019లో జగన్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

అయితే ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో అనిల్‌కుమార్‌ యాదవ్‌ పెద్దగా కనిపించడం లేదనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తన రాజకీయ ప్రయాణంపై అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. జగన్‌ తనను ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా అక్కడి నుంచి పోటీ చేస్తానని గతంలో స్పష్టం చేశారు. తాను జగన్‌కు విధేయుడినని చెప్పారు.

‘‘వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయొచ్చు.. చేయకపోవచ్చు. నా రాజకీయ ప్రస్థానం కూడా ఉండకపోవచ్చు. కానీ నెల్లూరు జిల్లాలో నాకో చరిత్ర ఉంది. అది జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చింది’’ అని అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

తాను నెల్లూరులో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని గుర్తుచేశారు. తన రాజకీయ జీవితంలో నెల్లూరు జిల్లాలో ఒక పేజీ, ఒక చరిత్రను జగన్‌ ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో అనిల్‌కుమార్‌ యాదవ్‌ రాజకీయాలకు సైలెంట్ గా సైడు అయిపోతున్నారా? లేక పార్టీ అధినేత నిర్ణయానికి అనుగుణంగా తదుపరి అడుగు వేయనున్నారా? అనే చర్చ నెల్లూరు మొదలైంది.

This post was last modified on August 27, 2026 8:02 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

9 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

11 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

11 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

13 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

14 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

15 hours ago