అవును.. టాలీవుడ్ పేరెత్తితే ఇప్పుడు మలయాళ నిర్మాతలు మండిపడుతున్నారట. అందుక్కారణం.. ఆ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు తెలుగు సినిమాల్లో వాళ్ల స్థాయికి మించి పారితోషకాలు ఇస్తుండడమే. మలయాళంలో ఎంత పెద్ద హీరో సినిమానైనా తక్కువ రోజుల్లో, తక్కువ బడ్జెట్లలో పూర్తి చేస్తారు. కేరళ మార్కెట్ పరిధి కూడా చిన్నదే. కానీ బయటి మార్కెట్లో మలయాళ సినిమాలకు ఉండే డిమాండ్ వల్ల ఆ చిత్రాలకు వసూళ్లు బాగానే వస్తుంటాయి. పెట్టుబడి మీద మంచి లాభాలు రాబడుతుంటారు నిర్మాతలు.
ఐతే ఈ మధ్య తెలుగు సినిమాల్లో నటించే ఆర్టిస్టులు, వాటికి పని చేసే టెక్నీషియన్లను ఎక్కువగా తెలుగు సినిమాల్లో తీసుకుంటున్నారు. పారితోషకాలు కూడా వారి స్థాయికి మించి ఆఫర్ చేస్తున్నారు. మలయాళంలో పుచ్చుకునేదాని కంటే మూణ్నాలుగు రెట్ల రెమ్యూనరేషన్ తెలుగులో వస్తుండడంతో వాళ్లు క్రమంగా ఇక్కడి సినిమాలకు ప్రయారిటీ ఇచ్చే పరిస్థితి వస్తోంది.
దుల్కర్ సల్మాన్ కొన్నేళ్ల నుంచి ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేస్తున్నాడు. మలయాళంలో సినిమాలు బాగా తగ్గించేశాడు. అందుక్కారణం.. ఇక్కడి కథలు బాగుండడంతో పాటు తన సొంత ఇండస్ట్రీలో కంటే నాలుగైదు రెట్ల పారితోషకం ఇక్కడ అందుతుండడమే అని సమాచారం. ఇక మామిత బైజు, అనస్వర రాజన్ లాంటి యంగ్ హీరోయిన్లు మలయాళంలో రూ.20-30 లక్షల పారితోషకం అందుకునే స్థాయిలో ఉంటే.. వారికి ఇప్పుడు తెలుగులో కోటి రూపాయల దాకా ఆఫర్ చేస్తున్నారు. దీంతో వారిని మలయాళ సినిమాల్లో పెట్టుకోవడం కష్టమవుతోంది.
తెలుగులో ఇస్తున్నట్లే ఎక్కువ రెమ్యూనరేషన్ అయినా ఇవ్వాలి. లేదంటే వారి మీద ఆశలు వదులుకోవాలి. ఇదంతా తెలుగు నిర్మాతల పుణ్యమే అని.. వారి స్థాయికి మించి పారితోషకాలిచ్చి చెడగొడుతున్నారని మలయాళ ప్రొడ్యూసర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఐతే తెలుగు నిర్మాతల వాదన వేరుగా ఉంది.
తాము కావాలని ఎక్కువ పారితోషకం ఇవ్వట్లేదని, న్యాయంగానే చెల్లిస్తున్నామని వారంటున్నారు. మలయాళంలో మాదిరి నెల రోజుల్లో ఇక్కడ సినిమా అయిపోదని.. వర్కింగ్ డేస్ ఎక్కువ, బడ్జెట్లు ఎక్కువ, కాల్ షీట్స్ కూడా ఎక్కువ అవసరం పడతాయి కాబట్టి.. ఇక్కడి మార్కెట్, ప్రమోషన్ సహా అవసరాలు అన్నీ చూసుకుని కరెక్ట్‌గానే మలయాళ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు డబ్బులు చెల్లిస్తున్నామని మన ప్రొడ్యూసర్లు వాదిస్తున్నారు.
This post was last modified on August 27, 2026 7:25 pm
విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…