Political News

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు తనను వేదిస్తున్నారంటూ జోగి రమేష్ కోడలు మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రచ్చ వెలుగులోకి వచ్చింది. మేఘనను కూతురిలాగ చూసుకున్నామని, గోరు ముద్దలు తినిపించామని జోగి రమేష్ చెబుతుంటే నాకు గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారని కోడలు మేఘన చెబుతుంది. మంగళవారం మీడియాతో మేఘన మాట్లాడింది.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి మాట్లాడిన తర్వాత నా కోడలు మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిందని జోగి రమేష్ ఆరోపించారు. దీనికి స్పందించిన మేఘన… ఔను నేను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో మాట్లాడింది నిజమే… నా సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. అంతకుముందు వైసీపీ అధినేత జగన్ తో కలిసేందుకు ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదని చెప్పారు.

నన్ను కూతురిలాగ చూసుకొని వుంటే సమస్య వచ్చేది కాదన్నారు. అదనపు కట్నం తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని మా అత్త శకుంతల చెప్పారని తెలిపిన మేఘన పెళ్ళైన రెండు నెలలకే రాజీవ్ ఎందుకు పిటీషన్ వేసాడని ప్రశ్నించారు. తన భర్త రాజీవ్ కు వున్న శారీరక లోపాలను దాచిపెట్టి పెళ్లి చేశారని, ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తామంటూ నన్ను పుట్టింటికి పంపించారని తెలిపారు.

పెళ్ళికి ముందు హిందువులమని చెప్పారని, పెళ్లయ్యాక క్రైస్తవం స్వీకరించినట్లు చెబుతున్నారని వివరించారు. జోగి రమేష్ ఇంట్లో పూజ గది లేదని, నా దగ్గర ఆధారాలు వున్నాయి, అవసరం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాను అని వెల్లడించారు.

మాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాను. ఏడాదిగా కుమిలి పోతున్నాను. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానంటూ మేఘన స్పష్టం చేశారు. దీంతో జోగి రమేష్ కుటుంబం చిక్కుల్లో పడినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్టయి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ కేసు లో బెయిల్ మీద వున్న ఆయనకు ఇంటిపోరు మరింత తలనొప్పిగా మారింది. రాజకీయంగా వైసీపీ కి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి తీసుకొచ్చింది. అందుకే కోడలి వ్యవహారంలో వైసీపీ ముట్టీముట్టనట్లుంటుందని ప్రచారం జరుగుతుంది.

This post was last modified on August 25, 2026 3:18 pm

Share

Recent Posts

చిరుకు వచ్చిన ఇబ్బందే ప్రభాస్‌కూ

టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…

19 minutes ago

గోల లేకుండా డేట్ వేసుకున్న గూఢచారి 2

ప్యాన్ ఇండియా సినిమాలకున్న అతి పెద్ద సమస్య రిలీజ్ డేట్ వేసుకోవడం. ఒకవేళ మంచి తేదీ దొరికినా దానికి కట్టుబడి…

30 minutes ago

డాల‌స్‌ థియేట‌ర్లో తెలుగు మెనూ

తెలుగు వాళ్లు అమెరికాకు వెళ్లి సెటిల్ కావ‌డం అన్న‌ది చాలా మామూలు విష‌యం అయిపోయింది ఈ రోజుల్లో. అక్క‌డ ఏ…

2 hours ago

హీరోగా మాయమై.. దర్శకుడిగా తిరిగొచ్చాడు

కార్తికేయ గుమ్మకొండ.. ఎనిమిదేళ్ల ముందు టాలీవుడ్లో మార్మోగిన పేరిది. తన తొలి చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’తో ఎలాంటి ప్రభావం…

2 hours ago

మక్కాలో తొలిసారి టెన్షన్…

ప్రపంచంలోని ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మక్కా నగరంలో తొలిసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హౌతీ తిరుగుబాటుదారుల వరస దాడుల…

2 hours ago

యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ఉందా?

యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు తీసుకురావడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న చర్చగా మారింది. రూ.2 వేలకు…

4 hours ago